• facebook
  • whatsapp
  • telegram

Highcourt: 3 నెలల్లో ఆ నియామకాలు చేపట్టాలి

* సీడీపీవో, మహిళా శిశు సంక్షేమశాఖ పోస్టులపై టీఎస్‌పీఎస్సీకి హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: ఐసీడీఎస్‌ పరిధిలోని 54 శిశు అభివృధ్ధి ప్రాజెక్టు అధికారి (సీడీపీవో) పోస్టులతో పాటు మహిళా శిశు సంక్షేమశాఖలోని ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ (సూపర్‌వైజర్‌) గ్రేడ్‌-1 పోస్టుల ఎంపిక ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)కి ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబరు 5న జారీచేసిన నోటిఫికేషన్‌ ప్రకారం సీడీపీవో పోస్టుల భర్తీకి సంబంధించి నియామక ప్రక్రియ పూర్తయినప్పటికీ నియామకాలు చేపట్టకపోవడాన్ని సవాల్‌ చేస్తూ కె.నిఖిత మరో 12 మంది.. నవంబరు నోటిఫికేషన్‌ ప్రకారం మహిళా శిశు సంక్షేమశాఖలో సూపర్‌వైజర్‌ పోస్టులను భర్తీ చేయకపోవడంపై సంహిత మరో 36 మంది హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ పి.మాధవీదేవి విచారణ చేపట్టారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది చిల్లా రమేశ్‌ వాదనలు వినిపిస్తూ నోటిఫికేషన్‌ ఆధారంగా కమిషన్‌ నియామక ప్రక్రియ చేపట్టిందని, మెరిట్‌ లిస్ట్‌ ప్రకటించడంతోపాటు సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయిందన్నారు. ఇతర ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా ఈ నియామకాలను కూడా నిలిపివేసిందన్నారు. వీటికి సంబంధించి ఎలాంటి లీకేజీ ఆరోపణలు లేవన్నారు. టీఎస్‌పీఎస్సీ తరఫు న్యాయవాది ఎం.రాంగోపాల్‌రావు వాదనలు వినిపిస్తూ గ్రూప్‌-1, డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌-2, ఏఈఈ పోస్టులకు చెందిన పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోందని, అందువల్ల నియామకాలను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు తెలిపారు. వాదనలను విన్న న్యాయమూర్తి సెప్టెంబరు నాటి సీడీపీవో, సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీ నోటిఫికేషన్లపై ఎలాంటి ఆరోపణలు లేనందున నియామకాలను నిలిపివేయడం సరికాదన్నారు. మూడు నెలల్లోగా ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశిస్తూ పిటిషన్లపై విచారణను మూసివేశారు.
 




మరింత సమాచారం... మీ కోసం!

‣ బీటెక్‌తో ఆర్మీలో ఉద్యోగాలు

‣ నాలుగేళ్ల కోర్సు.. నైపుణ్యాలతో మెరుగు!

‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!

‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.