• facebook
  • whatsapp
  • telegram

Jobs: అయిదేళ్లలో 3,000కు పైగా నియామకాలు: టైటన్‌  

ముంబయి: వచ్చే అయిదేళ్లలో 3,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తున్నట్లు టైటన్‌ కంపెనీ పేర్కొంది. ఇంజినీరింగ్‌, డిజైన్‌, లగ్జరీ, డిజిటల్‌, డేటా అనలిటిక్స్‌, మార్కెటింగ్‌, విక్రయాల విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టనుంది. డేటా అనలిటిక్స్‌, సైబర్‌ భద్రత, ప్రోడక్ట్‌ మేనేజ్‌మెంట్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇతరత్రా కొత్త తరం నైపుణ్యాల్లో వృత్తి నిపుణుల కోసం కంపెనీ చూస్తోంది. ‘వచ్చే అయిదేళ్లలో రూ.1,00,000 కోట్ల వ్యాపారాన్ని సాధించే దిశగా మా ప్రయాణాన్ని తీర్చిదిద్దనున్నాం. ఇందులో భాగంగా 3,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవాలని అనుకుంటున్నామ’ని టైటన్‌ కంపెనీ  హెచ్‌ఆర్‌-కార్పొరేట్‌-రిటైల్‌ విభాగాధిపతి ప్రియ మథిలాకాథ్‌ పిళ్లై వెల్లడించారు. ప్రస్తుతం కంపెనీ సిబ్బందిలో 60% మంది మెట్రో నగరాల నుంచి, మిగిలినవారు రెండో, మూడో శ్రేణి పట్టణాల నుంచి ఉన్నారు. ఇంజినీరింగ్‌ సిబ్బందిని వచ్చే 2-3 ఏళ్లలో 50% పెంచుకోవాలని భావిస్తున్నట్లు టైటన్‌ పేర్కొంది. ఏటా జరిగే నియామకాల్లో ప్రాంగణ నియామకాల వాటా 15-18% వరకు ఉండొచ్చని అంటోంది.

* రూ.3 లక్షల కోట్లకు మార్కెట్‌ విలువ: టైటన్‌ షేరు మంగళవారం ఒక దశలో 52 వారాల గరిష్ఠ స్థాయి అయిన రూ.3400కు చేరుకోవడంతో సంస్థ మార్కెట్‌ విలువ రూ.3 లక్షల కోట్లను అధిగమించింది. చివరకు ఈ షేరు బీఎస్‌ఈలో 1.44% లాభంతో రూ.3394.15 వద్ద స్థిరపడగా, మార్కెట్‌ విలువ రూ.3,01,327.94 కోట్లు గా నమోదైంది.

* టైటన్‌ మార్కెట్‌ విలువ 2019 మార్చి 28న తొలిసారిగా రూ.లక్ష కోట్లకు చేరింది. 2021 అక్టోబరు 7న రూ.2 లక్షల కోట్లకు, తాజాగా రూ.3 లక్షల కోట్లకు సంస్థ మార్కెట్‌ విలువ చేరింది. మార్కెట్‌ విలువ పరంగా దేశీయంగా  17వ స్థానాన్ని పొందింది. ఏడాది వ్యవధిలో టైటన్‌ షేర్లు 32.39 శాతం లాభపడ్డాయి.
 

* రత్నాభరణాల తయారీ, విక్రయ సంస్థ క్యారట్‌లేన్‌లో అదనంగా 27.18 శాతం వాటా కొనుగోలుకు టైటన్‌కు కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఇచ్చింది.
 




మరింత సమాచారం... మీ కోసం!

‣ బీటెక్‌తో ఆర్మీలో ఉద్యోగాలు

‣ నాలుగేళ్ల కోర్సు.. నైపుణ్యాలతో మెరుగు!

‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!

‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!

‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.