* ప్రొఫైల్ సృష్టించేటప్పుడు, వీసా స్లాట్లకు వేరే నంబర్లు ఇవ్వొద్దు
* అమల్లోకి వచ్చిన అమెరికా విద్యార్థి వీసా కొత్త నిబంధనలు
దిల్లీ: వీసాల కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ విద్యార్థులకు అమెరికా రాయబార కార్యాలయం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. ఈ మార్పులు నవంబరు 27న నుంచి అమల్లోకి వచ్చాయి. ఎఫ్, ఎం, జే వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఇవి వర్తిస్తాయి. వీసా దరఖాస్తుల్లో మోసాలు, అపాయింట్మెంట్ వ్యవస్థ దుర్వినియోగాన్ని అరికట్టేందుకే ఈ నిబంధనలను తీసుకొచ్చినట్లు రాయబార కార్యాలయం తెలిపింది. కొత్త నిబంధనల ప్రకారం.. విద్యార్థి వీసాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. అధికారిక వెబ్సైట్లో తమ ప్రొఫైల్ క్రియేషన్, వీసా అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకునేటప్పుడు సొంత పాస్‌పోర్టు సమాచారాన్నే వినియోగించాలి. తప్పుడు పాస్‌పోర్టు నంబరు ఇస్తే.. ఆ దరఖాస్తులను వీసా దరఖాస్తు కేంద్రాలవద్ద తిరస్కరిస్తారు. అలాంటి వారి అపాయింట్మెంట్లను రద్దు చేస్తారు. వారు వీసా ఫీజులనూ కోల్పోవాల్సి ఉంటుంది. తప్పుడు పాస్‌పోర్టు నంబరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నవారు.. మళ్లీ సరైన నంబరుతో కొత్త ప్రొఫైల్‌ను క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఇందుకోసం మళ్లీ వీసా ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. పాత పాస్‌పోర్టు పోవడం, చోరీకి గురవడం వంటి సందర్భాల్లో కొత్త పాస్‌పోర్టు తీసుకున్నవారు, కొత్తగా రెన్యువల్ చేసుకున్నవారు.. పాత పాస్‌పోర్టుకు సంబంధించిన ఫొటో కాపీ, ఇతర డాక్యుమెంట్లను అందించాలి. అప్పుడే వారి అపాయింట్మెంట్ ప్రాసెస్‌కు అనుమతి లభిస్తుంది. ఎఫ్, ఎం వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు తప్పనిసరిగా స్టూడెండ్ అండ్ ఎక్స్ఛేంజి విజిటర్ ప్రోగ్రాం ధ్రువీకరించిన స్కూల్, ప్రోగ్రామ్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. ఇక, జే వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు అమెరికా విదేశాంగశాఖ అనుమతి ఉన్న సంస్థ నుంచి స్పాన్సర్‌షిప్‌ను పొందాలి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఒకటే పరీక్ష.. లక్షన్నర కొలువులు!
‣ స్టేట్ బ్యాంకులో 8,773 క్లర్క్ కొలువులు
‣ 44 వేల విద్యార్థుల అనుసంధానం.. సింప్లీ న్యూరోసైన్స్
‣ సామర్థ్యాలను గుర్తిస్తేనే గెలుపు!
‣ బీటెక్ తర్వాత.. ఉన్నత విద్య లేదా ఉద్యోగమా?
‣ రెజ్యూమె.. ప్రాధాన్యం తగ్గుతోందా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.