• facebook
  • whatsapp
  • telegram

APPSC: గ్రూపు-1, 2 నోటిఫికేషన్ల జారీ ఏమైంది?

* అదిగో ఇదిగో అని ఊరించడం న్యాయమా?

* నిరుద్యోగులంటే జగన్‌ ప్రభుత్వానికి అంత అలుసా?

* తీవ్ర నిరాశలో అభ్యర్థులు


 

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వానికి నిరుద్యోగులంటే లెక్కే లేదు. ఇవిగో పోస్టులు... ఇచ్చేస్తున్నాం నోటిఫికేషన్లు అంటూ... ఊరించి మోసగిస్తోంది. అసలు ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీనే తక్కువ. అరకొరగా ప్రకటించిన కొలువుల భర్తీకీ అతీగతీ లేదు. ‘ఇక జాప్యం జరగదు. నవంబరు ఆఖరులోగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ఇచ్చేస్తున్నాం. నిరుద్యోగులూ సిద్ధంగా ఉండండి’ అని నవంబరు 1న ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ప్రకటించింది. దాని అమలు మాత్రం తుస్సుమంది. ఈ ఏడాది ఆగస్టు 2న 4 కేటగిరీల్లో రిజర్వేషన్‌ విధానంలో తెచ్చిన మార్పులకు తగ్గట్లు ఆయా ప్రభుత్వ శాఖల నుంచి ఇండెంట్లు రాక, అమలు విధానంపై స్పష్టత లేక నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ పరిణామం వైకాపా ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని, తమ భవిష్యత్తుతో జగన్‌ ఆటలాడుతున్నారని నిరుద్యోగులు ధ్వజమెత్తుతున్నారు. నోటిఫికేషన్ల జారీ ఆలస్యమయ్యేకొద్దీ కొందరు అభ్యర్థులు వయోపరిమితిపరంగా అనర్హులవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చినప్పటికీ... పరీక్షల నిర్వహణ సహా నియామకాల పూర్తికి సమయం సరిపోకపోవచ్చు. మొత్తం ప్రక్రియ పూర్తి కావడం కొత్త ప్రభుత్వంలోనే సాధ్యమవుతుంది.



1,604 ఉద్యోగాల భర్తీ ఎప్పుడు?

2021 జూన్‌లో సీఎం జగన్‌ ఇచ్చిన జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం.. గ్రూపు-2, కళాశాలల లెక్చరర్ల పోస్టులు, ఇతర పోస్టుల భర్తీకి ఇప్పటికీ నోటిఫికేషన్లు వెలువడలేదు. సీఎం చెప్పినవీ అమలు కాకపోతుండటంతో నిరుద్యోగుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. 2021 జూన్‌ 18న, గత ఏడాది మార్చిలో ఆర్థికశాఖ జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా... గ్రూపు-2 పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ ఇప్పటికీ జారీ చేయలేదు. గ్రూపు-1, గ్రూపు-2 కింద ప్రకటించిన పోస్టులు (35) తక్కువ సంఖ్యలో ఉన్నాయని, వాటిని పెంచాలంటూ నిరుద్యోగులు ఆందోళనలకు దిగారు. చివరికి గ్రూపు-1 కింద 110, గ్రూపు-2 కింద 182 పోస్టుల భర్తీకి 2022 మార్చి 31న ఆర్థికశాఖ మరో జీఓ జారీ చేసింది. గ్రూపు-1 నియామకాలు పూర్తయ్యాయి. మిగిలిన నోటిఫికేషన్లు రానే లేదు. తర్వాత మళ్లీ గ్రూపు-1 కింద 88, గ్రూపు-2 కింద 989 పోస్టుల్ని కలిపి మొత్తం 1,604 పోస్టుల భర్తీకి నవంబరు ఆఖరులోగా నోటిఫికేషన్లు ఇస్తామని ఏపీపీఎస్సీ అధికారికంగా ప్రకటించింది. ఈ జాబితాలో డిగ్రీ కళాశాలల అధ్యాపకుల పోస్టులు 267, పాలిటెక్నిక్‌ కళాశాలల అధ్యాపకుల పోస్టులు 99తోపాటు ఇతర ప్రభుత్వ శాఖల పోస్టులూ ఉన్నాయి.



తికమక.. మకతిక

ఈ ఏడాది ఆగస్టు 2న జారీ చేసిన జీఓ 77 ప్రకారం మహిళలు, స్పోర్ట్స్‌, మాజీ సైనికోద్యోగులు, దివ్యాంగుల కేటగిరీ పోస్టుల భర్తీ విధానంలో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. దీనికి అనుగుణంగా ప్రభుత్వ శాఖలు రోస్టర్‌ పాయింట్లను ఏపీపీఎస్సీ కార్యాలయానికి పంపాలి. కానీ జీఓ 77లో ఉన్న తికమక వల్ల ప్రభుత్వశాఖల అధికారులు రోస్టర్‌ పాయింట్ల వివరాల్ని పంపలేకపోయారు. ఉన్నతస్థాయిలో సమీక్ష సమావేశాలు, అవగాహన కార్యక్రమాల్ని నిర్వహించినప్పటికీ కొందరికి ఇప్పటికీ ఆ మార్పులు అర్థమే కాలేదు. సాధారణ పరిపాలనశాఖ అధికారులు నమూనాల్ని పంపినప్పటికీ ప్రభుత్వ శాఖల నుంచి స్పందన లేదు. సచివాలయంలో పక్కపక్కనే సంబంధిత ప్రభుత్వ శాఖలున్నా పురోగతి శూన్యం. ఈ వివరాలు వచ్చాకే ఏపీపీఎస్సీ ఉద్యోగ ప్రకటనల్ని జారీ చేస్తుంది.
 

ఏపీపీఎస్సీ గ్రూప్ - I - స్టడీమెటీరియల్

పేపర్ - I జనరల్ స్టడీస్

చరిత్ర, సంస్కృతి

రాజ్యాంగం, పాలిటీ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలు

భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికలు

భూగోళశాస్త్రం


పేపర్ - II జనరల్‌ ఆప్టిట్యూడ్‌

జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, మానసిక సామర్థ్యాలు

శాస్త్ర, సాంకేతిక రంగాలు

జాతీయ‌, అంత‌ర్జాతీయ‌, ప్రాంతీయ వ‌ర్త‌మానాంశాలు

ఏపీపీఎస్సీ గ్రూప్ - II - స్టడీమెటీరియల్

సెక్షన్ - ఎ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ

1. జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యత కలిగిన సంఘటనలు

2.  అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ వర్తమాన అంశాలు

3. జనరల్‌ సైన్స్, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతికతలో సమకాలీన అభివృద్ధి, దైనందిన జీవితంలో అనువర్తనాలు

4.  భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో భారతదేశంలో సామాజిక, ఆర్థిక, రాజకీయ చరిత్ర

5.  భారత రాజకీయ వ్యవస్థ, పాలన: రాజ్యాంగ సమస్యలు, ప్రభుత్వ విధానాలు, సంస్కరణలు, ఈ-గవర్నెన్స్‌ కార్యక్రమాలు

6.  ఆంధ్రప్రదేశ్‌పై ప్రత్యేక దృష్టితో భారత భూగోళశాస్త్రం

7. విపత్తు నిర్వహణ: విపత్తులు సంభవించే ప్రాంతాలు, నష్టనివారణ ఉపశమన చర్యలు, రిమోట్‌ సెన్సింగ్‌, జీఐఎస్‌ సహాయంతో విపత్తు అంచనా

8  సుస్థిరమైన అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ

9  తార్కిక వివరణ, విశ్లేషణాత్మక సామర్థ్యాలు, తార్కిక అన్వయం

10  దత్తాంశ విశదీకరణ:   ఎ) దత్తాంశానికి టేబుల్‌ రూపం, బి) దత్తాంశ దృశ్యీకరణ, అన్వయం,    సి) ప్రాథమిక దత్తాంశ విశ్లేషణ (అంకగణితం, మధ్యగణితం, బాహుళకం) 

11 ఆంధ్రప్రదేశ్‌ విభజన, పరిపాలన, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక, రాజకీయ, చట్టపరమైన సమస్యలు


సెక్షన్ - బి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, భారత రాజ్యాంగం


సెక్షన్ - సి భారతదేశ ప్లానింగ్, ఆర్థిక వ్యవస్థ


పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు

నమూనా ప్రశ్నపత్రాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.