• facebook
  • whatsapp
  • telegram

Nursing Training: జర్మనీలో నర్సింగ్‌ శిక్షణకు అవకాశం

రంగశాయిపేట, న్యూస్‌టుడే: తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లిమిటెడ్, రాష్ట్ర ప్రభుత్వ కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ ఆధ్వర్యంలో జర్మనీలో నర్సింగ్‌ శిక్షణ, ఉపాధి అవకాశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మాధవి డిసెంబరు 11న ఒక ప్రకటనలో తెలిపారు. నర్సింగ్‌లో అంతర్జాతీయ డిగ్రీ కోసం మూడేళ్ల పాటు శిక్షణ ఉంటుందని, ఆ సమయంలో నెలకు రూ.లక్ష ఉపకార వేతనం అందిస్తారని చెప్పారు. కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత, 18 నుంచి 28 ఏళ్ల వయసు గల అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థులకు జర్మనీకి వెళ్లే ముందు హైదరాబాద్‌లో జర్మనీ భాషపై ఆరు నెలల రెసిడెన్షియల్‌ శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం నెలకు రూ.2 నుంచి రూ.3 లక్షల వరకు ఉద్యోగ హామీ ఇస్తున్నట్లు వివరించారు. మరిన్ని వివరాలకు 63022 92450, 79012 90580 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. 
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ బాడీ లాంగ్వేజ్ ఎందుకు ముఖ్యం?

‣ దిద్దుబాటుతో విజయం తథ్యం!

‣ వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు

‣ 995 ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కొలువులు

‣ వైరాలజీ సంస్థలో ఉద్యోగాలు

‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!

‣ ఐటీఐ, డిప్లొమాతో సెయిల్‌లో ఉద్యోగాలు


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.