• facebook
  • whatsapp
  • telegram

Jobs: నిరుద్యోగులకు అండగా.. ఉపాధి మెండుగా

యువతకు భరోసాగా జిల్లా ఉపాధికల్పన కార్యాలయం
న్యూస్‌టుడే, కరీంనగర్‌ కలెక్టరేట్‌: జిల్లాలోని నిరుద్యోగులకు అండగా జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం నిలుస్తోంది. పది, ఇంటర్‌, డిగ్రీ, పీజీ చదివిన అభ్యర్థుల కోసం పలు ప్రైవేట్‌ సంస్థల నుంచి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. ఎంప్లాయీమెంట్‌ కార్యాలయ అధికారులు తమ కార్యాలయం ద్వారా ప్రతినెలా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పిస్తున్నారు. National career service NCS.gov.inలో ఉద్యోగ సమాచారం పొందుపరుస్తున్నారు. తెలంగాణ ఓవర్సీస్‌ మ్యాన్‌పవర్‌ కంపెనీ లి.(టామ్‌కామ్‌) ద్వారా నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు జర్మనీ వంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. యువతకు ఉపాధికి తోడ్పాటునందించే ఉచిత స్కిల్‌ (నైపుణ్య) శిక్షణలను ఆయా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో నిర్వహిస్తున్నారు. గల్ఫ్‌లో ఉద్యోగ అవకాశాలను సైతం కల్పిస్తున్నారు. అందుకు అవసరమైన శిక్షణ  ఇస్తున్నారు. ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లే వారికి రవాణా ఛార్జీలు సంస్థే భరిస్తోంది.
17,857 మంది పేర్లు నమోదు
జిల్లాలో ఉపాధికల్పనాధికారి కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకున్న మొత్తం నిరుద్యోగుల సంఖ్య 17,857. ఇందులో పదో తరగతి చదివినవారి సంఖ్య 4,381, ఇంటర్‌ 4,224, డిగ్రీ 5,704, స్టెనో 5, బీఎడ్‌ 245, ఇంజినీరింగ్‌, ఫార్మాసూటికల్‌, తదితర కోర్సులలో కలిపి మొత్తం 17,857 మంది నిరుద్యోగులు ఉన్నారు.
517 మందికి ఉపాధి
ఈ సంవత్సరం జనవరి 2023 నుంచి సెప్టెంబరు వరకు జిల్లాలో 517 మంది నిరుద్యోగులకు వేర్వేరు ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగ అవకాశం కల్పించారు. నెలకు రెండు నుంచి మూడు ఉద్యోగ మేళాల చొప్పున మొత్తం 33 మేళాలు నిర్వహించారు. 2,263 మంది నిరుద్యోగులు హాజరు కాగా అందులో నుంచి 517 మంది అభ్యర్థులను ఎంపిక చేశారు. వారు ప్రస్తుతం ఆయా సంస్థల్లో ఉద్యోగం చేస్తున్నారు.
ఫార్మసీలో ఉద్యోగం: లక్ష్మీ, బీఫార్మసీ, కరీంనగర్‌
ఎంప్లాయీమెంట్‌ కార్యాలయం వారు నిర్వహించిన ఉద్యోగ మేళాకు హాజరయ్యాను. అక్కడ రాత, మౌఖిక పరీక్షలు నిర్వహించిన అనంతరం అపోలో ఫార్మసీలో ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో పని చేస్తున్నా. వచ్చే జీతంతో పాటు ఏటా డీఏ, ఇతర అలవెన్స్‌లు పెరుగనున్నాయి.
సంతోషంగా ఉంది: రవళి, కరీంనగర్‌
ఎంప్లాయీమెంట్‌ కార్యాలయం వారి ఉద్యోగ మేళా ద్వారా కరీంనగర్‌కు చెందిన ఆటోమొబైల్‌ షోరూంలో హెచ్‌.ఆర్‌.మేనేజర్‌గా ఎంపికయ్యా. ఉన్నత చదువుల అనంతరం ఎటువంటి ఆందోళన లేకుండా స్థానికంగానే ఉద్యోగం లభించటంతో మా కుంటుంబ సభ్యులు అందరిలో సంతోషం నెలకొంది.
నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి: దేవేందర్‌రావు, జిల్లా ఉపాధికల్పనాధికారి, కరీంనగర్‌
అభ్యర్థులకు ఉద్యోగాలపై అవగాహనతో పాటు, ఉచిత శిక్షణ అందజేస్తున్నాం. అవసరమైన ప్రైవేట్‌ సంస్థలు కార్యాలయాన్ని సంప్రదిస్తే వారికి అవసరమైన ఉద్యోగార్హత ఉన్న అభ్యర్థులను ఎంపిక చేసి ఉద్యోగం కల్పిస్తున్నాం. ఉద్యోగ సమాచారం కోసం వేర్వేరు వెబ్‌సైట్లను అందుబాటులోకి తీసుకొచ్చాం. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలి.

మరింత సమాచారం... మీ కోసం!

‣ బాడీ లాంగ్వేజ్ ఎందుకు ముఖ్యం?

‣ దిద్దుబాటుతో విజయం తథ్యం!

‣ వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు

‣ 995 ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ కొలువులు

‣ వైరాలజీ సంస్థలో ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.