• facebook
  • whatsapp
  • telegram

Vocational Training: కస్తూర్బాలో వృత్తి విద్యా శిక్షణ

న్యూస్‌టుడే, కరీంనగర్‌ విద్యావిభాగం: గ్రామీణ స్థాయి విద్యార్థులకు ఇంటర్మీడియట్‌ వరకు అన్ని వసతులతో కూడిన ఉచిత విద్య అందుతోంది. ఆ తర్వాత ఉన్నత చదువులకు వెళ్లలేకపోతున్నారు. నైపుణ్యాలు, విద్యార్హతలు కొరవడి ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుకోవడంలేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు వృత్తి నైపుణ్య శిక్షణ అందించి భవిష్యత్తులో ఉద్యోగ, ఉపాధి రంగాల్లో స్థిరపడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నిర్వహణ బాధ్యతను రాష్ట్ర సమగ్ర శిక్షా అధికారులకు అప్పగించింది.

విద్యాసంస్థల ఎంపిక..

ఉమ్మడి జిల్లాలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు (కేజీబీవీ)లు, తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్‌ పాఠశాలలు వృత్తి విద్యా శిక్షణ కోర్సులకు ఎంపికయ్యాయి. మొత్తం 12 పాఠశాలల్లో శిక్షణ అందించనున్నారు. కేజీబీవీల్లో తల్లి, తండ్రి లేని వారు, చదువు మధ్యలో మానేసిన బాలికలు చదువుతుండగా, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో పేద కుటుంబాల పిల్లలున్నారు. ఇంటర్మీడియెట్‌ వరకు ఉచిత విద్య, వసతి సౌకర్యాలు కల్పిస్తుండటంతో విద్యాభ్యాసం సజావుగానే కొనసాగుతోంది. అనంతరం ఉన్నత చదువులు వారికి ఆర్థిక భారమవుతున్నాయి. ఇంటర్మీడియెట్‌ పూర్తి చేసేలోపు వృత్తి విద్య కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు సర్కారు నిర్ణయం తీసుకుంది. 9వ తరగతి, ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పలు కోర్సుల్లో శిక్షణ అందించి 10వ తరగతి, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ప్రాక్టికల్‌ తరగతులు నిర్వహించి ప్రభుత్వపరంగా వారికి ధ్రువపత్రాలు అందించనుంది. వృత్తి విద్య శిక్షణ బాధ్యతలు సమగ్ర శిక్షా అధికారులు వివిధ ప్రైవేటు కంపెనీలు, పలు సంస్థలకు అప్పగించారు. ఉమ్మడి జిల్లాలోని మరికొన్ని ఆదర్శ పాఠశాలల్లో కూడా వృత్తి విద్య శిక్షణ కోర్సుల ఏర్పాటుకు విద్యాశాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు.

ఎక్కడెక్కడ.. ఏయే కోర్సులు..

* జగిత్యాల జిల్లాలోని తెలంగాణ రాష్ట్ర రెసిడెన్షియల్‌ స్కూల్‌, జూనియర్‌ కళాశాలలో హెల్త్‌కేర్‌, జగిత్యాల, కోరుట్ల కేజీబీవీల్లో మైక్రోఫైనాన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ కోర్సులు.

* కరీంనగర్‌ జిల్లాలోని కేజీబీవీ శంకరపట్నం, ఇల్లందకుంటలలో అగ్రికల్చర్‌, కేజీబీవీ కరీంనగర్‌లో ఐటీ-ఐటీఎస్‌ కోర్సులు.

* పెద్దపల్లి జిల్లాలోని టీఎస్‌ఆర్‌ఎస్‌జేసీ మేడారంలో టెలీకమ్యూనికేషన్‌, కేజీబీవీ శ్రీరాంపూర్‌, సుల్తానాబాద్‌లలో ఫుడ్‌ ఇండస్ట్రీ, కేజీబీవీ అంతర్గాంలో అగ్రకల్చర్‌ కోర్సులు.

* రాజన్న సిరిసిల్ల జిల్లాలోని టీఎస్‌ఆర్‌ఎస్‌జేసీలో ఐటీ-ఐటీఈఎస్‌, కేజీబీవీ గంభీరావుపేటలో అగ్రికల్చర్‌ కోర్సులు.
 

మరింత సమాచారం... మీ కోసం!

‣ నౌకాదళంలో 910 సివిల్‌ కొలువులు

‣ ఫుట్‌వేర్‌ తయారీలో శిక్షణ ఇలా..

‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు

‣ సివిల్స్‌ మౌఖిక పరీక్షకు మౌలిక సూచనలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.