• facebook
  • whatsapp
  • telegram

Libraries: ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటు

ఉమ్మడి జిల్లాలో 868 బడులకు అవకాశం
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: విద్యార్థుల్లో పుస్తక పఠనంపై ఆసక్తి పెంచి, అక్షర విజ్ఞానం పెంపొందించేందుకు విద్యా శాఖ గ్రంథాలయాలు(రీడింగ్‌ కార్నర్‌లు) ఏర్పాటు చేస్తోంది. ‘మన ఊరు-మన బడి’లో అభివృద్ధి చేసిన పాఠశాలలకు పుస్తకాలు అందిస్తోంది. బాల్యం నుంచే పఠనాసక్తిని పెంచి పరిపూర్ణంగా తీర్చిదిద్దాలని అధికారులు భావిస్తున్నారు.\
గ్రంథాలయాల ఏర్పాటులో భాగంగా ఈ ఏడాది జనవరిలో ప్రయోగాత్మకంగా కొన్ని పాఠశాలలకు పుస్తకాలు పంపిణీ చేశారు. మరో విడతలో విజ్ఞానదాయకమైన పుస్తకాలు అందించాలని నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలో రెండో విడతలో 868 పాఠశాలలకు అవకాశం దక్కింది. ఒక్కో బడికి విజ్ఞానం, వినోదానికి అవసరమైన 240 రకాల పుస్తకాలు సరఫరా చేయనున్నారు. తొలి విడతలో 608 పాఠశాలల్లోని విద్యార్థులు క్రమం తప్పకుండా పుస్తకాలు చదువుతూ విజ్ఞానం పెంచుకుంటున్నారు.
పఠనానికి ప్రత్యేక పీరియడ్‌
పాఠశాల గ్రంథాలయంలో విద్యార్థులను చదివించేందుకు ప్రత్యేక పీరియడ్‌ కేటాయించారు. ఆయా పుస్తకాలపై ప్రామాణికమైన విషయాలను ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. సమగ్ర అంశాలపై విద్యార్థులు పట్టు సాధించేందుకు చొరవ చూపుతున్నారు. చదివిన అంశాలు ఏ మేరకు గుర్తున్నాయో పరీక్షిస్తున్నారు. పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు. పలు చోట్ల స్వచ్ఛంద సంస్థలు, దాతల విరాళాలతో మరిన్ని పుస్తకాలు కొనుగోలు చేసుకొని సమకూర్చుకుంటున్నారు.
రెండో విడతలో 868 చోట్ల..
ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఎంపికైన వాటికి పుస్తకాలు పంపిణీ చేసేందకు రూమ్‌ టూ రీడ్‌, నేషనల్‌ బుక్‌ ట్రస్టు అనే స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకున్నారు. పిల్లల్లో పఠనాన్ని అలవాటుగా చేయడం, స్వతంత్ర పాఠకులుగా ఎదిగేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ప్రతి పాఠశాలకు 240 రకాల పుస్తకాలు, కార్పెట్లు, 9 రకాల గోడపత్రికలను పంపిణీ చేయనున్నారు. గ్రంథాలయాల నిర్వహణ, పుస్తకాలు భద్రపరచడంపై జిల్లా స్థాయిలో ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఉమ్మడి జిల్లాలో 868 పాఠశాలలకు మొత్తం 2.08 లక్షల పుస్తకాలు రానున్నాయి.
ఆకర్షణీయంగా రూపకల్పన
పిల్లలను ఆకట్టుకునేలా పుస్తకాలపై ఆకర్షణీయ రంగుల బొమ్మలతో ముద్రించారు. వీటిలో బాల సాహిత్యం, చిత్ర పుస్తకాలు, కథలు, కార్డులు, సమాచార పుస్తకాలు, కవితా సంకలనాలు, పోస్టర్లు, కరపత్రాలున్నాయి. విద్యార్థుల స్థాయికి తగిన విజ్ఞానం అందుకునేలా వీటిని రూపొందించారు. మొదటి స్థాయి(ఆకుపచ్చ) సరళ అక్షరాలు, రెండో స్థాయి(ఎరుపు) సరళ పదాలు, మూడో స్థాయి(నారింజ) ద్విత్వక్షరాలు, స్వల్ప ఒత్తుల పదాలు, నాలుగో స్థాయి(తెలుపు) చిన్న చిన్న పేరాలు, అయిదో స్థాయి(నీలి) ఆసక్తిగా ఉండే రెండు, మూడు పేరాలు, ఆరో స్థాయి(పసుపు) విద్యార్థి ఎవరి సాయం లేకుండానే స్వయంగా చదవగలిగే పుస్తకాలున్నాయి.

మరింత సమాచారం... మీ కోసం!

‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు

‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!

‣ బీమా సంస్థలో కొలువులు

‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.