• facebook
  • whatsapp
  • telegram

TSPSC: టీఎస్‌పీఎస్సీకి త్వరలో అయిదుగురు సభ్యులు

ఉద్యోగ నియామకాల్లో వేగం పెంచేందుకు ప్రభుత్వ నిర్ణయం


ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగ నియామకాల్లో నెలకొన్న సందిగ్ధతకు తెరదించి.. కార్యకలాపాల్లో వేగం పెంచేందుకు టీఎస్‌పీఎస్సీలో కొత్తగా అయిదుగురు సభ్యులను ప్రభుత్వం నియమించనుంది. కమిషన్‌లో ఛైర్మన్‌, మరో 10 మంది సభ్యులు ఉండాలి. ప్రస్తుతం ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి,  అయిదుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. వారిలో ఛైర్మన్‌, ముగ్గురు సభ్యులు గవర్నర్‌కు రాజీనామా సమర్పించినా ఇంకా ఆమోదం లభించలేదు. వీటిపై న్యాయసలహా తీసుకుంటున్నారు. ఒకవేళ ఆ ప్రక్రియ ఆలస్యమైనా ఉద్యోగ నియామకాలను వేగవంతం చేసుకునేందుకు కొత్తగా అయిదుగురిని సభ్యులుగా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలిస్తోంది. పరీక్షలు పూర్తయినా ఫలితాలు ప్రకటించాల్సినవి ఎన్నో ఉన్నాయి. సభ్యులు వస్తే వాటిని వెల్లడించవచ్చని భావిస్తున్నారు. కొత్తగా నియమించే సభ్యుల్లో ఒకరికి తాత్కాలిక ఛైర్మన్‌ బాధ్యతలు అప్పగిస్తారా? అన్న చర్చ సాగుతోంది.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 07-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.