• facebook
  • whatsapp
  • telegram

Results: కేఎల్‌ వర్సిటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

విజయవాడ (గవర్నర్‌పేట), న్యూస్‌టుడే : ఇంజినీర్లు దేశాభివృద్ధికి అవసరమని రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. కేఎల్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం విజయవాడ, హైదరాబాద్‌ క్యాంపస్‌లలో ఇంజినీరింగ్‌, డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను జనవరి19న ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా వనిత మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగిన ప్రతిభను గుర్తించేందుకు కేఎల్‌ విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షలు నిర్వహించడం హర్షణీయమన్నారు. అనంతరం ఫిబ్రవరి 2 నుంచి 5 వరకూ జరిగే ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను ఆవిష్కరించారు. వైస్‌ ఛాన్సలర్‌ జి.పార్థసారథివర్మ మాట్లాడుతూ కేఎల్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ విద్యలో ప్రవేశం కల్పించేందుకు జాతీయ స్థాయిలో 3 సార్లు పరీక్షలు నిర్వహిస్తుందన్నారు. ప్రస్తుతం మొదటి సారి నిర్వహించిన పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు తెలిపారు.



మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ‘ఫిజిక్స్‌’ కోర్సులు

‣ ఎన్‌సీఎల్‌లో ట్రైనీ సూపర్‌వైజరీ పోస్టులు

‣ ‘సాయ్‌’లో కోచ్‌ కొలువులు

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ సైన్యంలో స్పెషల్‌ ఎంట్రీ

‣ ‘నిక్మార్‌’ నిర్మాణ రంగ కోర్సులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.