• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 19-01-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. శ్రీజకు టీటీ టైటిల్‌ 

డబ్ల్యూటీటీ ఫీడర్‌ కార్పస్‌ క్రిస్టి టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీలో తెలుగమ్మాయి ఆకుల శ్రీజ విజేతగా నిలిచింది. కెరీర్‌లో తొలి అంతర్జాతీయ టైటిల్‌తో కొత్త సీజన్‌ను ఘనంగా ప్రారంభించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


2. ఎస్సీ వర్గీకరణకు కమిటీ

ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై అధ్యయనం కోసం కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌గాబా నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైంది. ఇందులో కేంద్ర హోంశాఖ; సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ; గిరిజన వ్యవహారాలు; న్యాయ శాఖ; సామాజిక న్యాయం-సాధికారశాఖ కార్యదర్శులు సభ్యులు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


3. జాబిల్లి ఉపరితలంపై జపాన్‌ ల్యాండర్‌  

జపాన్‌ ప్రయోగించిన తేలికపాటి లూనార్‌ ల్యాండర్‌ చంద్రుడిపై విజయవంతంగా దిగింది. దీంతో జాబిల్లిపై వ్యోమనౌకను సాఫీగా దించిన (సాఫ్ట్‌ల్యాండింగ్‌ సాధించిన) ఐదో దేశంగా గుర్తింపు పొందింది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా, భారత్‌ మాత్రమే చందమామపై ల్యాండర్లను దించాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


4. విజయవంతంగా ముగిసిన సీఎం దావోస్‌ పర్యటన 

ముఖ్యమంత్రి దావోస్‌ పర్యటన విజయవంతమైంది. రూ.40,232 కోట్ల పెట్టుబడుల ఒప్పందాలతో తెలంగాణ కొత్త రికార్డు నెలకొల్పింది. గత ఏడాది దావోస్‌లో రాష్ట్రం సాధించిన పెట్టుబడుల మొత్తం కంటే ఇది రెండింతలు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


5. ప్రపంచ సుందరి పోటీలకు భారత్‌ ఆతిథ్యం

భారత్‌కు అరుదైన అవకాశం లభించింది. 71వ ప్రపంచ సుందరి (మిస్‌ వరల్డ్‌) పోటీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఫిబ్రవరి 18 నుంచి మార్చి 9 వరకు దిల్లీలోని భారత్‌ మండపం, ముంబయిలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మిస్‌ వరల్డ్‌ పోటీలు నిర్వహించనున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 



మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.