• facebook
  • whatsapp
  • telegram

APPSC Group1 Application: గ్రూప్‌-1 ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగింపు 

* మార్చి 17న ప్రాథమిక పరీక్ష


ఈనాడు ప్రతిభ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-1 సర్వీస్‌ నియామక దరఖాస్తు గడువు తేదీని పొడిగించినట్లు ఏపీపీఎస్సీ సభ్యుడు పరిగె సుధీర్‌ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. గతంలో నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లుగా జనవరి 21వ తేదీనే చివరి తేదీ కాగా.. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గడువు పెంచామన్నారు. మార్చి 17వ తేదీన నిర్వహించే ప్రాథమిక పరీక్షలో ఎటువంటి మార్పు లేదన్నారు. అర్హులైన అభ్యర్థులు జనవరి 28వ తేదీ అర్ధరాత్రి 11.59 గంటల్లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో 81 ఖాళీలు భర్తీ కానున్నాయి. 

ద‌ర‌ఖాస్తుల స‌వ‌ర‌ణ‌కు అవ‌కాశం

గ్రూప్‌-1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ వివరాలను ఎడిట్‌ చేసుకొనేందుకు ఏపీపీఎస్సీ అవకాశం కల్పించింది. ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ను అందుబాటులో పొందుపరిచింది. వివరాలు తప్పుగా నమోదు చేసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తప్పులు సరి చేసుకోవాలని తెలిపింది. 


  ప్రకటన వివరాలు   


  ఏపీపీఎస్సీ గ్రూప్-1 కరెక్షన్స్‌ విండో లింక్‌ కోసం క్లిక్‌ చేయండి  


 

  ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 సర్వీస్‌ నోటిఫికేషన్‌ వివరాల కోసం క్లిక్‌ చేయండి  
 


 

  ఏపీపీఎస్సీ గ్రూప్‌-I స్క్రీనింగ్ టెస్ట్  


  పేపర్‌-1: జనరల్‌ స్టడీస్‌  
 

చరిత్ర, సంస్కృతి

రాజ్యాంగం, పాలిటీ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలు

భారతదేశ, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికలు

భూగోళశాస్త్రం


  పేపర్ 2: జనరల్‌ ఆప్టిట్యూడ్‌  
 

జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ, మానసిక సామర్థ్యాలు

శాస్త్ర, సాంకేతిక రంగాలు
 

   ఏపీపీఎస్సీ పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు 
 

   ఏపీపీఎస్సీనమూనా ప్రశ్నపత్రాలు  



 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.