• facebook
  • whatsapp
  • telegram

TS EAMCET: మే రెండో వారంలో ఎంసెట్‌?

* త్వ‌ర‌లో ప్రవేశ పరీక్షల తేదీల వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ సహా మొత్తం ఏడు ప్రవేశ పరీక్షల తేదీలను జవనరి 24, 25న ప్రకటించనున్నారు. ఎంసెట్‌ పేరు మార్పుపై జీవో జారీ అయితే జనవరి 24న సాయంత్రానికి వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి రూపొందించిన కాలపట్టికకు సీఎం రేవంత్‌రెడ్డి జనవరి 24 సాయంత్రం ఆమోదం తెలిపినట్లు సమాచారం. మే రెండో వారంలో ఎంసెట్‌ ప్రారంభిస్తారని సమాచారం. పీఈసెట్‌, పీజీఈసెట్‌లు మాత్రం మే చివరి నుంచి జూన్‌ తొలి వారంలో జరగనున్నాయని తెలిసింది. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలని సీఎంతోపాటు విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఎంసెట్‌తోపాటు ఐసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌, లాసెట్‌, పీఈసెట్‌ల తేదీలను ప్రకటిస్తారు. ఈసెట్‌ను మాత్రం మే మొదటి వారంలో నిర్వహిస్తారు. మరోవైపు పీజీ ఇంజినీరింగ్‌ సెట్‌లో ఈసారి పరీక్ష విధానాన్ని మార్చాలని నిపుణుల కమిటీ రాష్ట్ర ఉన్నత విద్యామండలికి సిఫారసు చేసింది.


 

 తెలంగాణ ఎంసెట్/ఈఏపీసెట్‌  స్టడీమెటీరియల్  
 

1.భౌతికశాస్త్రం
2.గణితశాస్త్రం
3.రసాయన శాస్త్రం
4.వృక్షశాస్త్రం
5.జంతుశాస్త్రం

 

  పాత ప్ర‌శ్న‌ప‌త్రా‌లు   

  నమూనా ప్రశ్నపత్రాలు   




మరింత సమాచారం... మీ కోసం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్‌ అనలిటిక్స్‌

‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.