• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 27-01-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. రోహన్‌ బోపన్న రికార్డు 

అత్యంత పెద్ద వయసులో గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీ గెలిచిన ఆటగాడిగా భారత టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న రికార్డు సృష్టించాడు. మాథ్యూ ఎబ్డెన్‌ (ఆస్ట్రేలియా)తో కలిసి అతడు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ పురుషుల డబుల్స్‌ టైటిల్‌ చేజిక్కించుకున్నాడు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


2. పరువునష్టం కేసులో ట్రంప్‌నకు భారీ జరిమానా

అమెరికా అధ్యక్ష పీఠంపై రెండోసారి కూర్చోవాలని కలలు కంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (77)కు కోర్టు కేసుల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అమెరికన్‌ మాజీ కాలమిస్ట్‌ జీన్‌ కరోల్‌ (80) దాఖలు చేసిన పరువునష్టం కేసులో న్యూయార్క్‌లోని మాన్‌హటన్‌ ఫెడరల్‌ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


3. కలకలం రేపిన సుధీంద్ర కులకర్ణి వ్యాసం

భారత రాజ్యాంగ నిర్మాణంలో బి.ఆర్‌.అంబేడ్కర్‌ కంటే తొలి ప్రధాని నెహ్రూ పాత్రే ఎక్కువంటూ రాజకీయవేత్త, కాలమిస్టు సుధీంద్ర కులకర్ణి రాసిన వ్యాసం కలకలం రేపింది. గతంలో భాజపా దిగ్గజ నేత ఎల్‌.కె.ఆడ్వాణీకి సన్నిహితుడిగా ఈయన వ్యవహరించారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


4. ఐసిస్‌పై కృత్రిమ మేధాస్త్రం

సామాజిక మాధ్యమాల్లో ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐసిస్‌) ప్రచారాన్ని, తీవ్రవాద వినియోగదారులను పసిగట్టగల కృత్రిమ మేధా (ఏఐ) మోడల్‌ను అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు రూపొందించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 



మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 28-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.