• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 29-01-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. 14 లక్షల వీసా దరఖాస్తుల పరిష్కారం

భారత్‌లోని కాన్సులేట్లద్వారా 2023లో 14 లక్షల మంది భారతీయుల వీసా దరఖాస్తులను పరిష్కరించామని, సందర్శక వీసాల (బీ-1/బీ-2) దరఖాస్తుదారులు వేచి ఉండే సమయాన్ని 75శాతం తగ్గించగలిగామని దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


2. చందమామపై పనిచేస్తున్న జపాన్‌ ల్యాండర్‌ 

జాబిల్లిపైకి జపాన్‌ ప్రయోగించిన ‘స్మార్ట్‌ ల్యాండర్‌ ఫర్‌ ఇన్వెస్టిగేటింగ్‌ మూన్‌ (స్లిమ్‌)’ వ్యోమనౌక తాజాగా పనిచేయడం మొదలుపెట్టింది. దీంతో ఈ ల్యాండర్‌ భవితపై ఏర్పడ్డ ఉత్కంఠకు తెరపడింది. జనవరి 20న స్లిమ్‌.. చంద్రుడి ఉపరితలంపై దిగింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


3. బడికెళ్తే దీర్ఘాయుష్షు లాన్సెట్‌ అధ్యయనం వెల్లడి 

బుద్ధిగా బడికెళ్లి చదువుకోవోయ్‌.. నిండుగా వందేళ్లు వర్ధిల్లవోయ్‌.. అని ఇకపై తల్లిదండ్రులు పిల్లలకు చెప్పొచ్చు. అవును మరి.. చదువుకుంటే జ్ఞానమే కాదు, ఆయుర్దాయం కూడా పెరుగుతుందని ప్రతిష్ఠాత్మక లాన్సెట్‌ జర్నల్‌ ప్రచురించిన ఓ అధ్యయనం చెబుతోంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


4. ఆంధ్రప్రదేశ్‌ శకటానికి తృతీయ బహుమతి

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దిల్లీలో నిర్వహించిన పరేడ్‌లో ఏపీ విద్యాశాఖ శకటానికి పీపుల్స్‌ ఛాయిస్‌ విభాగంలో తృతీయ బహుమతి వచ్చినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


5. జనవరి 29 క్రీడలు

ప్రపంచకప్‌ షూటింగ్‌లో సోనమ్‌కు రజతం ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్‌ షూటింగ్‌లో భారత క్రీడాకారిణి సోనమ్‌ మస్కర్‌ సత్తాచాటింది. కెరీర్‌లో తొలి ప్రపంచకప్‌ ఆడుతున్న సోనమ్‌ రజత పతకంతో మెరిసింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో సోనమ్‌ (252.1 పాయింట్లు) ద్వితీయ స్థానం సాధించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 



మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 30-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.