• facebook
  • whatsapp
  • telegram

IIMC: ఐఐఎంసీకి డీమ్డ్‌ వర్సిటీ స్థాయి

దిల్లీ: జర్నలిజం, మాస్‌ కమ్యూనికేషన్‌ కోర్సులకు పేరొందిన ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌’ (ఐఐఎంసీ)కి డీమ్డ్‌ యూనివర్సిటీ స్థాయిని కల్పించాలని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ నిర్ణయించింది. దీనివల్ల కేవలం డిప్లొమాలే కాకుండా డిగ్రీలు ప్రదానం చేసేందుకు, డాక్టొరల్‌ ప్రోగ్రాంలు అందించేందుకు ఈ సంస్థకు వీలుంటుంది. 1965లో కేంద్ర సమాచార-ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలో దిల్లీ కేంద్రంగా ఏర్పాటైన ఐఐఎంసీకి జమ్మూ, అమరావతి (మహారాష్ట్ర), ఆయిజోల్‌, కొట్టాయం, ఢెంకనాల్‌లలో ప్రాంతీయ క్యాంపస్‌లు ఉన్నాయి. ఆంగ్లం, హిందీతో పాటు ఉర్దూ, ఒడియా, మరాఠీ, మలయాళంలలో జర్నలిజంలో పీజీ డిప్లొమా కోర్సుల్ని ప్రస్తుతం అందిస్తోంది. డీమ్డ్‌-టు-బి-యూనివర్సిటీ స్థాయిని ఐఐఎంసీ పొందడం ఎంతో ప్రత్యేకం, చరిత్రాత్మకమని కేంద్ర సమాచార-ప్రసార శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ పేర్కొన్నారు.
 



మరింత సమాచారం... మీ కోసం!

‣ సముద్రమంత ఉద్యోగావకాశాలు!

‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!

‣ ఎంఫిల్‌.. పీహెచ్‌డీ- ఏమిటి తేడా?

‣ ‘డేటా సైన్స్‌’తో డోకా లేదు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.