• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 03-02-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. భారతరత్నం ఆడ్వాణీ

భాజపా అగ్రనేత, మాజీ ఉపప్రధాని లాల్‌కృష్ణ ఆడ్వాణీ (96)కి కేంద్ర ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ను ప్రకటించింది. స్వయంగా ప్రధాని నరేంద్రమోదీ  ఈ విషయాన్ని వెల్లడించారు. ఇది తన జీవితంలో అత్యంత భావోద్వేగ క్షణమని ప్రధాని పేర్కొన్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


2. పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌కు మళ్లీ జైలుశిక్ష 

అవినీతి, అధికార రహస్యాల వెల్లడి కేసుల్లో శిక్షపడి జైలులో ఉన్న పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి  ఇమ్రాన్‌ఖాన్‌ను కష్టాలు వీడట్లేదు. తాజాగా ఆయనకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లాం నిబంధనలకు విరుద్ధంగా ‘నిఖా’ చేసుకున్నారన్న అభియోగం మోపిన కేసులో ఇమ్రాన్‌ఖాన్‌ (71), బుష్రా బీబీ (49) దంపతులకు పాక్‌లోని సీనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు  ఏడేళ్ల జైలుశిక్ష, రూ.5 లక్షల చొప్పున జరిమానా విధించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


3. పంజాబ్‌ గవర్నర్‌ బన్వారీలాల్‌ రాజీనామా

పంజాబ్‌ గవర్నర్, చండీగఢ్‌ అడ్మినిస్ట్రేటర్‌ బన్వారీలాల్‌ పురోహిత్‌  తన పదవులకు రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో వైదొలగుతున్నట్లు పేర్కొంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రాజీనామా లేఖ సమర్పించారు. కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిసిన మరుసటి రోజే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 



మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.