• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 11-02-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1.  ఆస్ట్రేలియాకే కప్పు

అండర్‌-19 ప్రపంచకప్‌ చేజారింది. ఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ టీమ్‌ఇండియా 79 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. మొదట ఆసీస్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 253 పరుగులు చేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


2.   కొడంగల్‌కు వైద్య కళాశాల

వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌లో వైద్య కళాశాల, నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొడంగల్‌లో ప్రస్తుతం ఉన్న 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని 220 పడకల ఆసుపత్రిగా మార్చనున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


3.  సైన్యమా.. ఇమ్రానా!

పాకిస్థాన్‌ ఎన్నికలను ప్రభావితం చేసిన సైన్యం.. అధికారంలోకి ఎవరు రావాలన్న విషయాన్నీ శాసించే దిశగానూ పావులు కదుపుతోంది. నవాజ్‌ షరీఫ్‌ నేతృత్వంలో పీఎంఎల్‌-ఎన్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించేందుకు సంపూర్ణ సహకారమందిస్తోంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


4.  భారతీయ విలువలపై ఆధారపడిన విద్యావ్యవస్థ అవసరం

భారతీయ విలువలపై ఆధారపడిన విద్యావ్యవస్థ ప్రస్తుతం మనకు అవసరమని ప్రధాని నరేంద్రమోదీ అభిప్రాయపడ్డారు. ఆర్యసమాజ్‌ వ్యవస్థాపకుడు స్వామి దయానంద సరస్వతి 200వ జయంతి సందర్భంగా.. గుజరాత్‌లోని మోర్బి జిల్లాలో ఆయన స్వస్థలమైన టంకారాలో నిర్వహించిన వేడుకను ఉద్దేశించి ప్రధాని వర్చువల్‌గా ప్రసంగించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


5.  జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఆదినారాయణ మరణం

ఓయూ విశ్రాంత ఆచార్యుడు, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ముండ్ర ఆదినారాయణ(73) గుండెపోటుతో మరణించారు. జనగామలో జరిగిన చెకుముకి సైన్స్‌ సంబరాల్లో ఆయన విద్యార్థులు, ఉపాధ్యాయులతో గడిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.