• facebook
  • whatsapp
  • telegram

TSPSC: జూన్‌ 9న గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష 

* 563 పోస్టులతో పునఃప్రకటన



ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 563 గ్రూప్‌-1 సర్వీసుల పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష జూన్‌ 9న జరుగుతుందని టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. 2022 నాటి గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను రద్దు చేసిన కమిషన్‌.. తాజాగా 563 పోస్టులతో పునఃప్రకటన జారీ చేసింది. వీటి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. నోటిఫికేషన్‌ జారీ చేసినప్పటికీ ప్రిలిమినరీ పరీక్ష తేదీని ప్రకటించకపోవడంతో ఎలా సన్నద్ధమవ్వాలని నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిర్వహణ తేదీని కమిషన్‌ వెల్లడించింది.



 

  టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-I స్క్రీనింగ్ టెస్ట్  
 

1. వర్తమానాంశాలు – ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు

2. అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు

3. జనరల్ సైన్స్ – శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత దేశం సాధించిన విజయాలు

4. పర్యావరణ అంశాలు – విపత్తు నిర్వహణ – నివారణ, ఉపశమనం కోసం వ్యూహాలు

5. భార‌తదేశ ఆర్థిక‌, సామాజిక అభివృద్ధి

6. ప్రపంచ భూగోళ శాస్త్రం, భారత భూగోళ శాస్త్రం, తెలంగాణ రాష్ట్ర భూగోళ శాస్త్రం

7. భారత దేశ చరిత్ర, సంస్కృతి – వారసత్వం

8. భారత ‌రాజ్యాంగం, రాజ‌కీయ వ్యవ‌స్థ

9. భారతదేశంలో ప‌రిపాల‌న‌, ప్రభుత్వ విధానాలు

10.తెలంగాణ రాష్ట్ర విధానాలు

11.తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం

12.సామాజిక మిన‌హాయింపు/ వెలి ; లింగ, కుల‌, తెగ‌ల‌, వైక‌ల్యం మొద‌లైన హ‌క్కులు, స‌మ్మళిత విధానాలు

13.లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ ప్రిటేషన్


  టీఎస్‌పీఎస్సీ గ్రూప్ - IV  


పేపర్ - I - జనరల్ స్టడీస్
 

1.  కరెంట్ అఫైర్స్

2.  అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు

3.  నిత్య జీవితంలో సామాన్య శాస్త్రం

4.  పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ

5.  భారతదేశం, తెలంగాణ భూగోళశాస్త్రం, ఆర్థికశాస్త్రం

6.  భారత రాజ్యాంగం: ముఖ్య లక్షణాలు

7  భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం

8  భారత జాతీయోద్యమంపై ప్రత్యేక దృష్టితో ఆధునిక భారతదేశ చరిత్ర

9  తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమం

10  తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం

11  తెలంగాణ రాష్ట్ర విధానాలు


పేపర్ - II-సెక్రటేరియల్ ఎబిలిటీస్
 

1.  మెంటల్ ఎబిలిటీ (వెర్బల్, నాన్ వెర్బల్)

2.  లాజికల్ రీజనింగ్

3.  కాంప్రహెన్షన

4.  వాక్యాల వరుస క్రమం (ప్యాసేజ్ను మెరుగ్గా విశ్లేషణ చేయడం)5.  సంఖ్యా, అంకగణిత సామర్థ్యాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.