ఈనాడు, హైదరాబాద్: గురుకుల విద్యాసంస్థల్లో జూనియర్ లెక్చరర్ల నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని ఇటీవల హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. నోటిఫికేషన్‌కు విరుద్ధంగా తమ అభ్యర్థిత్వాలను తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన గంగాప్రసాద్ మరో 9 మంది పిటిషన్ దాఖలుచేశారు. దీనిపై జస్టిస్ పుల్లా కార్తీక్ విచారణ చేపట్టగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నోటిఫికేషన్లో డిగ్రీలో జంతుశాస్త్రం, వృక్షశాస్త్రం ఉండాలని పేర్కొన్నారని... పీజీలో ఆ సబ్జెక్ట్‌లు లేవన్న కారణంగా తమను పక్కనపెట్టారన్నారు. రాత పరీక్షలో తాము అర్హత సాధించినా.. పరిశీలనకు కమిటీ వేశామని చెబుతున్నారన్నారు. మరోవైపు కమిటీ నివేదిక వచ్చేదాకా ఆగకుండా నియామకాలు చేపడుతున్నారన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి పిటిషనర్ల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలంటూ గురుకుల నియామకాల బోర్డును ఆదేశించారు. మార్చి 5న జారీ చేసిన నోటిఫికేషన్ కింద జరిగే నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని పేర్కొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొత్త అవకాశాలకు.. ఆన్లైన్ టీచింగ్!
‣ ఆస్ట్రోఫిజిక్స్‌తో అపార అవకాశాలు!
‣ జనరల్ డిగ్రీతో జాబ్ సాధ్యమే!
‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.