వాషింగ్టన్: విదేశీ వృత్తి నిపుణులు 2025 ఆర్థిక సంవత్సరానికి హెచ్ 1బీ వీసా దరఖాస్తు పెట్టుకోవడానికి మార్చి 22తో గడువు ముగుస్తుంది. భారతీయ సాంకేతిక నిపుణుల్లో విపరీతమైన గిరాకీ ఉన్న ఈ వీసా కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 6న మొదలైంది. విదేశీ ఉద్యోగులు అమెరికాలో పనిచేయడానికి అనుమతించే హెచ్ 1బీ వీసా కోసం ఐ-129 ఫారంను, ప్రీమియం ప్రాసెసింగ్‌కు ఐ-907 ఫారంనూ నింపవలసి ఉంటుంది. ఇవి రెండూ మైయు.ఎస్.సి.ఐ.ఎస్ వెబ్ సైట్లో అందుబాటులో ఉన్నాయి. హెచ్1బీ క్యాప్ పిటిషన్లకు ఆన్లైన్ లో ఫారాల దాఖలు ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానున్నది. ప్రతి ఏటా 65,000 హెచ్1బీ వీసాలను మంజూరు చేస్తారు. దీన్నే హెచ్ 1బీ క్యాప్ అంటారు. మరో 20,000 వీసాలను అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన వారికి కేటాయిస్తారు. హెచ్ 1బీ వీసాలలో అత్యధికం భారతీయ, చైనా టెక్ నిపుణులకే అందుతున్నాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియన్ కావచ్చు !
‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్ ఆవాసాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.