• facebook
  • whatsapp
  • telegram

10Th class: 3 నుంచి పదో తరగతి మూల్యాంకనం

కరీంనగర్‌ విద్యావిభాగం, న్యూస్‌టుడే: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్‌ 3న నుంచి కరీంనగర్‌లో ప్రారంభమవుతోంది. జిల్లా విద్యా శాఖ ఆధ్వర్యంలో సెయింట్‌ జాన్స్‌ పాఠశాల కేంద్రంలో ఏప్రిల్‌ 11వ తేదీ వరకు దీన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాల నుంచి జవాబుపత్రాలు ఇక్కడికి చేరగా, వాటిని స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచారు. జవాబు పత్రాలను కోడింగ్‌ ప్రక్రియ కూడా పూర్తి చేస్తున్నారు. ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో జనార్దన్‌రావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. మూల్యాంకన విధుల కోసం ఉపాధ్యాయులను కేటాయిస్తూ వారికి ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్‌ 3న  ఉదయం వారు ఈకేంద్రంలో విధుల కోసం రిపోర్టు చేయాల్సి ఉంది. 2.20 లక్షల జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాల్సి ఉంది. చీఫ్‌ ఎగ్జామినర్లు 94, అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు 563 మంది, స్పెషల్‌ అసిస్టెంట్లుగా 188 మందిని నియమించారు. వీరికి తోడు అవసరమైతే విధుల కోసం అదనంగా మరికొందరిని స్పెషల్‌ అసిస్టెంట్లుగా నియమించారు.  ఏప్రిల్‌ 2న  మూల్యాంకనంపై అసిస్టెంట్‌ ఎగ్జామినర్లతో జిల్లా విద్యాశాఖ అధికారులు సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు జారీ చేశారు.  కేంద్రంలో ఫర్నీచర్, తాగునీరు, ఫ్యాన్లు వంటి వాటిని ఏర్పాటు చేశారు. ఈసారి హెచ్‌ఆర్‌ఏ పొందుతున్న పాఠశాలల్లోని ఉపాధ్యాయులకు ఎక్కువ శాతం విధులను కేటాయించారు.

* విధుల మినహాయింపునకు యత్నాలు

గతంలో కొంత ఇష్టానుసారంగా విధులను ఉపాధ్యాయులకు కేటాయించడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి అందించే టీఏ, డీఏలతో మూల్యాంకనం కోసం మంజూరైన నిధులు సరిపోలేదని సమాచారం. దీని కారణంగానే గత ఏడు మూల్యాంకనానికి సంబంధించి కొందరికి నిధులు వారి ఖాతాల్లో జమ చేయలేదని ఉపాధ్యాయులు పలువురు పేర్కొంటున్నారు. మండే ఎండలు, వేడిగాలుల మధ్య మూల్యాంకన విధులను నిర్వహించేందుకు పలువురు నిరాసక్తత ప్రదర్శిస్తున్నారు. విధుల నుంచి మినహాయింపు పొందేందుకు పలువురు వారికి తోచిన రీతిలో ప్రయత్నాలు చేసుకుంటున్నారు. మూల్యాంకన విధులను పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల ఉపాధ్యాయులకు తక్కువగా కేటాయించి కరీంనగర్‌ జిల్లా వారికి ఎక్కువగా కేటాయించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఏటా కొన్ని సబ్జెక్టుల జవాబుపత్రాల మూల్యాంకనానికి విధులు నిర్వహించే వారు తక్కువ పడుతుండటంతో ఈసారి విధుల నుంచి మినహాయింపు కల్పించే విషయంలో జిల్లా విద్యాశాఖ నిక్కచ్చిగా వ్యవహరిస్తోంది. ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు మూల్యాంకన విధులకు కేటాయించడంతో  ఏప్రిల్‌ 8 నుంచి నిర్వహించే ఎస్‌ఏ-2 పరీక్షలకు ప్రతిబంధకాలు ఏర్పడనున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకు అవసరమైన మేరకు ఉపాధ్యాయులు ఉండేలా చూడాలని ప్రధానోపాధ్యాయులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. జిల్లా విద్యాశాఖ కూడా ప్రధానోపాధ్యాయుల నుంచి వివరాలను కోరింది.
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ మూడు నెల‌ల్లో గేట్ మొద‌టి ర్యాంకు

‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.