• facebook
  • whatsapp
  • telegram

TSPSC Recruitment: అకౌంట్స్ ఆఫీసర్స్ ఎంపిక ఫలితాలు

* ఏప్రిల్‌ 8న ధ్రువపత్రాల పరిశీలన 

ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణ పురపాలకశాఖలో అకౌంట్స్ ఆఫీసర్స్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్, సీనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి సంబంధించి ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. మెరిట్‌ జాబితాలో ఉన్న అభ్యర్థులకు ఏప్రిల్‌ 8వ తేదీన టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్‌ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీల భర్తీకి టీఎస్‌పీఎస్సీ గతేడాది డిసెంబరులో నోటిఫికేషన్ విడుదల, ఆగస్టు రాతపరీక్ష, ఫిబ్రవరిలో ఫలితాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 78 పోస్టులకు భర్తీచేయనున్నారు. వీటిలో అకౌంట్స్ ఆఫీసర్- 1, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్- 13, సీనియర్ అకౌంటెంట్- 64 పోస్టులు ఉన్నాయి. 


  అకౌంట్స్ ఆఫీసర్స్ పోస్టుల ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థులు
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 04-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.