1. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష
ఆర్బీఐ గవర్నరు శక్తికాంత దాస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తొలి ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను వెల్లడించారు. వరుసగా ఏడో సారి కీలక రేట్లను ఆర్బీఐ యథాతథంగా ఉంచింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. ప్లాస్టిక్ కాలుష్య రిజర్వాయర్లుగా సముద్ర అంతర్భాగాలు
సముద్రాలు ప్లాస్టిక్ కాలుష్య కాసారాలుగా మారిపోతున్నాయని తాజా పరిశోధన పేర్కొంది. సాగర గర్భంలో 1.1 కోట్ల టన్నుల ప్లాస్టిక్ పేరుకుపోయిందని వివరించింది. ప్రతి నిమిషానికి ఒక ట్రక్కు పరిమాణంలో ఈ పదార్థం సముద్రాల్లో వచ్చి చేరుతోందని తెలిపింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ఉక్రెయిన్ డ్రోన్ల దాడిలో రష్యా యుద్ధ విమానాలు ధ్వంసం
ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎస్‌బీయూ, సైన్యం సంయుక్తంగా నిర్వహించిన భారీ డ్రోన్ల దాడిలో ఆరు యుద్ధ విమానాలను కోల్పోయింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ‘న్యాయ్ పత్ర’ పేరుతోకాంగ్రెస్ మ్యానిఫెస్టో విడుదల
కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక సమరం కోసం భారీ హామీలతో మ్యానిఫెస్టో విడుదల చేసింది. కేంద్ర మాజీ హోంమంత్రి పి.చిదంబరం ఛైర్మన్‌గా ఉన్న కమిటీ నేతృత్వంలో రూపొందించిన ఈ 45 పేజీల మ్యానిఫెస్టోను దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ‘న్యాయ్ పత్ర’ పేరుతో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల సమక్షంలో విడుదల చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. తొలితరం టీవీ న్యూస్‌రీడర్ శాంతిస్వరూప్ మరణం
టీవీ వార్తలు చదవడంలో ప్రత్యేక ముద్ర వేసిన తొలితరం తెలుగు న్యూస్ రీడర్ శాంతిస్వరూప్ (74) ఇక లేరు. గుండెపోటుతో హైదరాబాద్ మలక్‌పేటలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
6. రూ.225 కోట్లతో మివి సంస్థ ప్లాంట్
స్వదేశీ ఆడియో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీదారు మివి సంస్థ తెలంగాణలో అత్యాధునిక ప్లాంట్‌ను రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఈ-సిటీలో ఆరున్నర ఎకరాల విస్తీర్ణంలో రూ.225 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.