• facebook
  • whatsapp
  • telegram

Education: అరచేతిలో పుస్తక ప్రపంచం

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: ప్రభుత్వ కొలువు సాధించాలంటే ప్రణాళికాబద్ధంగా చదవడంతో పాటు.. పరీక్షలకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వివిధ శాఖల్లో ఉండే ఖాళీలను భర్తీ చేసేందుకు గ్రూప్‌ 1, 2, డీఎస్సీ నోటిఫికేషన్లను ప్రకటించింది. యూపీఎస్సీ, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌, ఆర్బీఐ, బ్యాంకింగ్‌ మొదలైన ఉద్యోగాలు సాధించేందుకు అభ్యర్థులు గ్రంథాలయాలు, శిక్షణ కేంద్రాల బాట పట్టారు. మరికొందరు ఇంటి వద్దనే సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆర్థిక స్థోమత, పుస్తకాలు అందుబాటులో లేనివారికి అంతర్జాలం చక్కటి వేదికగా మారింది. అవసరమైన పరిజ్ఞానం కోసం సమగ్ర సమాచారంతో కూడిన ‘నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియా’ (ఎన్‌డీఎల్‌ఐ) వెబ్‌సైట్‌లో కొన్ని లక్షల పుస్తకాలు నిక్షిప్తమై ఉన్నాయి. నీట్‌, జేఈఈ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు అవసరమైన స్టడీ మెటీరియల్‌తో పాటు గత ప్రశ్నపత్రాలు అందుబాటులో ఉన్నాయి.

* కేజీ నుంచి పీజీ వరకు
ప్రాథమిక పాఠశాలల విద్యార్థుల నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్‌ విద్యార్థుల వరకు ఆన్‌లైన్‌ పుస్తకాలు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఎన్‌డీఎల్‌ఐని ప్రారంభించింది. దీన్ని ఖరగ్‌పూర్‌ ఐఐటీ అభివృద్ధిచేసింది. అన్ని భారతీయ భాషల నుంచి ముఖ్యమైన పుస్తకాలను దీనిలో భద్రపరిచింది. ఐఐటీ జేఈఈ, నీట్‌, జామ్‌, గేట్‌, యూజీసీ నెట్‌ పరీక్షలకుకావాల్సిన మెటీరియల్‌, ఆడియో, వీడియో పాఠాలు అందుబాటులో ఉన్నాయి. జాతీయ విద్య, శిక్షణ పరిశోధనసంస్ధ(ఎన్‌సీఈఆర్టీ) రూపొందించిన వివిధ తరగతుల పాఠ్యపుస్తకాలు, ప్రముఖ విశ్వవిద్యాలయాలకు చెందిన నిపుణులు వివిధ రంగాలకు సంబంధించి చేసిన 38 వేల పరిశోధన వ్యాసాలు ఉన్నాయి. పరిశోధనలకు ఉపయోగపడే వేల సంఖ్యలో అధ్యయనాలు ఉన్నాయి. ఎన్‌డీఎల్‌ఐలో ఏ విభాగానికి సంబంధించిన పుస్తకాలు కావాలో దానిపై క్లిక్‌ చేస్తే ఆయా పాఠ్యాంశాల పేజీలు ప్రత్యక్షమవుతాయి.

* రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే సరి

నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ ఆఫ్‌ ఇండియాలో తొలుత https://ndl.iitkgp.ac.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేయాలి. పేరు, పుట్టిన తేదీ, పట్టణం/గ్రామం, మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, చదువుతున్న విద్యాసంస్థ పేరు నమోదు చేయాలి. చదువు పూర్తయిన వారు జిల్లా గ్రంథాలయం పేరు నమోదు చేస్తే సరిపోతుంది. మెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అయిన తరువాత కావాల్సిన పుస్తకాలు చదువుకోవచ్చు. దీనిలో ఉచితంగా విద్యార్థులు, నిరుద్యోగులకు కావాల్సిన స్టడీ మెటీరియల్‌ అందుబాటులో ఉంటుంది.
 



మరింత సమాచారం... మీ కోసం!

‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్‌

‣ సోషల్‌ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర

‣ మార్కెట్‌ మందగమనంలో ఉద్యోగ సాధన!

‣ మ‌లిద‌శ ప‌రీక్ష‌లో గెలుపు వ్యూహం!

‣ మూడు నెల‌ల్లో గేట్ మొద‌టి ర్యాంకు

‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.