01. ఐఎన్సీబీకి మరోసారి జగజీత్ పవాడియా!
ఐక్యరాజ్యసమితి వేదికపై భారత్‌కు ఓ కీలక విజయం లభించింది. 13 మంది సభ్యులుండే అంతర్జాతీయ మాదకద్రవ్య నియంత్రణ మండలి (ఐఎన్‌సీబీ)కి జరిగిన ఎన్నికల్లో భారత ప్రతినిధి జగజీత్ పవాడియా అత్యధిక ఓట్లతో మరోసారి గెలుపొందారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
02. హెపటైటిస్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయ్
వైరల్ హెపటైటిస్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య పెరుగుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో)హెచ్చరించింది. మరణాల విషయంలో ఇది క్షయ వ్యాధి స్థాయిలో ఉందని పేర్కొంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
03. చంద్రయాన్-3 బృందానికి అవార్డు
భారత చంద్రయాన్-3 బృందానికి 2024కు సంబంధించి ‘జాన్ ఎల్ జాక్ స్విగెర్ట్ జూనియర్’ అవార్డు లభించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
04. ఏటీపీ టూర్ తాజా ర్యాంకింగ్స్ టాపర్లు.. జకోవిచ్, బోపన్న
ఏటీపీ టూర్ తాజా ర్యాంకింగ్స్‌లో సింగిల్స్‌లో జకోవిచ్ (36 ఏళ్లు), , డబుల్స్‌లో బోపన్న (44 ఏళ్లు) టాప్ ర్యాంకులో నిలిచారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
05. కక్ష్య నుంచి సంపూర్ణ సూర్యగ్రహణం
ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి చిత్రీకరించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
06. డిస్కంల బకాయిలు రూ.5,577 కోట్లు
దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండు, వినియోగం పెరుగుతుండటంతో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు చెల్లించాల్సిన బకాయిలు కూడా అంతకంతకూ పెరిగిపోతున్నాయి. అన్ని రాష్ట్రాల డిస్కంలు విద్యుదుత్పత్తి సంస్థ(జెన్కో)లకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు రూ.81,568 కోట్లకు చేరగా..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
07. ఏడాదిలో 12 వేల కి.మీ.ల రోడ్ల నిర్మాణం
దేశవ్యాప్తంగా 2023-24 ఆర్థిక సంవత్సరంలో 12,349 కిలోమీటర్ల మేర రహదారులను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ నిర్మించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
08. నోబెల్ అవార్డు గ్రహీత పీటర్ హిగ్స్ మరణం
‘హిగ్స్ బోసన్’ కణాన్ని కనుగొన్న బ్రిటన్‌కు చెందిన దిగ్గజ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ అవార్డు గ్రహీత పీటర్ హిగ్స్ (94) మరణించినట్లు ఈడిన్‌బర్గ్ యూనివర్సిటీ వెల్లడించింది. హిగ్స్ ‘దైవ కణం’ లేదా ‘హిగ్స్ బోసన్’ సిద్ధాంతంపై పరిశోధనలు చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.