• facebook
  • whatsapp
  • telegram

Jobs: నిరుద్యోగులకు వరం.. పోటీ పరీక్షల సమాచారం

సర్కారు కొలువులు దక్కించుకోవడానికి నిరుద్యోగులు ఎంతో కష్టపడుతున్నారు. గతంలో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష రెండు సార్లు రాసినా పలు కారణాలతో రద్దు కావడంతో నిరుద్యోగ అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ప్రస్తుతం మళ్లీ పోటీ పరీక్షల నోటిఫికేషన్లు వస్తుండటంతో యువతలో ఆశలు చిగురిస్తున్నాయి. కొందరు పోటీ పరీక్షల శిక్షణ కోసం మళ్లీ హైదరాబాద్‌ బాట పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలు పోటీ పరీక్షలపై ఆశలు పెట్టుకుని నిరుద్యోగులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు.

డిజిటల్‌ గ్రంథాలయంతో మేలు...

నిరుద్యోగులు స్థానికంగా ఉన్న గ్రంథాలయాలు ఉపయోగించుకోవడం వల్ల పూర్తి స్థాయిలో ఉపయోగం ఉండదనేది విద్యావేత్తల భావన. స్థానికంగా కొన్ని రకాల పుస్తకాలు మాత్రమే అందుబాటులో ఉంటాయి. డిజిటల్‌ గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవడంపై దృష్టి సారిస్తే పోటీ పరీక్షల సిలబస్‌ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పటికే గ్రూపు-1, 2, డీఏవో పోస్టులను భర్తీ చేసేందుకు నిర్వహించే పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ ఇటీవల ఖరారు చేసింది. వీటితో పాటు యూపీఎస్సీ, స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ), బ్యాంకింగ్‌ తదితర రంగాల్లో ఖాళీల భర్తీకి పోటీ పరీక్షలు ఎప్పటికప్పుడు నిర్వహించనున్నాయి.

అందుబాటులో 68 లక్షల పుస్తకాలు

పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలు కొనలేనివారు, శిక్షణ కేంద్రాల్లో ఫీజులు చెల్లించే పరిస్థితులు లేనివారికి అంతర్జాలం ఎంతో తోడ్పాటు  అందిస్తోంది. జాతీయ డిజిటల్‌ గ్రంథాలయం(ఎన్‌డీఎల్‌) నిరుద్యోగులకు చక్కటి వేదికగా మారింది. ఆన్‌లైన్‌లో పలు పోటీ పరీక్షల సమాచారంతో పాటు ఆయా పరీక్షలకు ఉపయోగపడే సిలబస్‌కు సంబంధించిన పుస్తకాలు ఎన్‌డీఎల్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇందులో పలు పోటీ పరీక్షలకు ఉపయోగపడే 68 లక్షల పుస్తకాలు నిక్షిప్తమై ఉన్నాయి. ‘జాతీయ విద్యా శిక్షణ పరిశోధన’ సంస్థ(ఎన్‌సీఈఆర్టీ) రూపొందించిన పలు పాఠ్యంశాలకు సంబంధించిన పుస్తకాలు, దేశంలోని పలు విశ్వవిద్యాలయాలు రూపొందించిన పరిశోధన వ్యాసాలు సైతం ఎన్‌డీఎల్‌లో ఉన్నాయి. విషయ పరిజ్ఞానానికి సంబంధించిన ఆరు విభాగాలు ఇందులో ఉన్నాయి. ఏ విభాగానికి సంబంధించిన పుస్తకం కావాలో దానిపై క్లిక్‌ చేస్తే ఆయా పాఠ్యాంశాలకు సంబంధించిన పేజీలు ప్రత్యక్షమవుతాయి.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 12-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.