• facebook
  • whatsapp
  • telegram

Lovely Professional University: లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో యూజీ, పీజీ అడ్మిషన్లు

* ఎల్పీయూ నెస్ట్2024 నోటిఫికేషన్‌ జారీ

* స్కాలర్‌షిప్‌ పొందే అవకాశం 

ఈనాడు ప్రతిభ డెస్క్: పంజాబ్ రాష్ట్రం ఫగ్వారాలోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (ఎల్పీయూ)- పలు కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ‘లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నేషనల్ ఎంట్రన్స్ అండ్ స్కాలర్‌షిప్ టెస్ట్ (ఎల్పీయూ నెస్ట్ 2024)’ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరీక్ష ద్వారా ఇంజినీరింగ్, లా, మెడికల్‌ ల్యాబొరేటరీ సైన్స్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, డిజైన్, అగ్రికల్చర్, ఆర్చిటెక్చర్, పర్ఫామింగ్ ఆర్ట్స్, సైకాలజీ, ఫిజియోథెరపీ, కామర్స్, ఎకనామిక్స్, ఫిజకల్ ఎడ్యుకేషన్, ఫైన్ ఆర్ట్స్‌ విభాగాల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు. యూజీ, పీజీ కోర్సులకు ఏప్రిల్ 30వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశ పరీక్ష ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. సీయూఈటీ-2024 పరీక్ష ఆధారంగా ఆయా డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందవచ్చు. సీయూఈటీ పరీక్షలో వచ్చిన స్కోరు ఆధారంగా ఎల్పీయూలో స్కాలర్‌షిప్‌ పొందేందుకు అవకాశం ఉంటుంది.

  Website 


 

  Online application  

Updated Date : 27-04-2024 17:26:44

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం