• facebook
  • whatsapp
  • telegram

APECET: ఏపీ, తెలంగాణ ఈసెట్‌ 2024 హాల్‌టికెట్లు విడుదల 

* ఏపీలో మే 8న, తెలంగాణలో మే 6న పరీక్ష

ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలుగు రాష్ట్రాల ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఈసెట్‌)-2024 హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ నంబర్‌, క్వాలిఫయింగ్‌ ఎగ్జామ్‌ హాల్‌టికెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలతో హాల్‌టికెట్ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దీని ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్‌) అభ్యర్థులకు 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్షను ఏపీలో జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ- అనంతపురం నిర్వహిస్తుండగా, తెలంగాణలో ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. ఏపీలో మే 8వ తేదీన, తెలంగాణలో మే 6న పరీక్ష జరుగనుంది.



  ఏపీ ఈసెట్‌ 2024 హాల్‌టికెట్ కోసం క్లిక్‌ చేయండి  



  తెలంగాణ ఈసెట్‌ 2024 హాల్‌టికెట్ కోసం క్లిక్‌ చేయండి  


 





 

Updated Date : 01-05-2024 17:33:16

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం