* మే 5వ తేదీన పరీక్ష
* తెలుగులోనూ ప్రశ్నపత్రం
|
ఈనాడు ప్రతిభ డెస్క్: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన నీట్ (National Eligibility-cum-Entrance Test) యూజీ (NEET UG 2024) మే 5వ తేదీన మధ్యాహ్నం 2గంటల నుంచి 5.20 గంటల మధ్య జరగనుంది. అడ్మిట్‌కార్డులను ఇప్పటికే విడుదల చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధం చేసింది. ఈ పరీక్షకు 23,81,833 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష (Examination) వ్యవధి 200 నిమిషాలు (3 గంటల 20 నిమిషాలు). ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో ఈ పరీక్షను పెన్ను, పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. ఎంబీబీఎస్(MBBS), బీడీఎస్, బీఎస్‌ఎంఎస్, బీయూఎంఎస్, బీహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పరీక్ష మార్గదర్శకాలను తప్పకుండా పాటించాల్సి ఉంటుంది.
అభ్యర్థులు పాటించాల్సిన నియమ నిబంధనలు ఇవే...
‣ పరీక్ష రాసే విద్యార్థులు పరీక్ష సమయం కంటే గంట ముందుగా కేంద్రాలకు చేరుకుంటే మంచిది.
‣ పరీక్ష కేంద్రాన్ని ముందే అడ్మిట్‌కార్డులో సూచించిన చిరునామా ప్రకారం పరిశీలించుకోవాలి.
‣ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు, పాస్‌పోర్టు సైజు ఫొటోను తీసుకెళ్లాలి.
‣ పరీక్షార్థులు డ్రెస్ కోడ్ విధిగా పాటించాలి. పొడవు చేతులున్న డ్రెస్సులు, షూలు, నగలు, మెటల్ వస్తువులను లోనికి అనుమతించరు.
‣ స్లిప్పర్లు, తక్కువ ఎత్తున్న శాండిల్స్ వేసుకుంటే మంచిది.
‣ పేపర్లు, జామెట్రీ బాక్సులు, ప్లాస్టిక్ పౌచ్‌లు, కాలిక్యులేటర్లు, రైటింగ్ ప్యాడ్స్, పెన్‌డ్రైవ్స్, ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష కేంద్రానికి అనుతించరు.
‣ చేతి గడియారాలు, వాలెట్లు, హ్యాండ్‌బ్యాగ్, బెల్ట్‌లు, టోపీలు ధరించకూడదు.
‣ మొబైల్ ఫోన్లు, బ్లూటూత్, ఇయర్‌ఫోన్లు, స్మార్ట్ వాచ్ వంటి ఎలక్ట్రానిక్స్ పరికరాలకు తీసుకెళ్లకూడదు.
‣ పరీక్ష రాసేందుకు అవసరమైన బాల్ పాయింట్ పెన్నును పరీక్ష గదిలోనే ఇస్తారు.
Click here for NEET UG 2024 Mock Test
Download NEET UG 2024 Admitcard
NEET Study Material
►Biology |
►Chemistry |
►Physics |
♦ NEET Previous Papers 2024
♦ Model Papers
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.