• facebook
  • whatsapp
  • telegram

SSC MTS Recruitment: ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్‌ ఎగ్జామ్‌-2024 నోటిఫికేషన్‌

* పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు
 


ఈనాడు ప్రతిభ డెస్క్‌: కేంద్ర మంత్రిత్వ శాఖల్లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి సంబంధించి ఉద్యోగ ప్రకటన విడుదల చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సమాయత్తమవుతోంది. ఎస్‌ఎస్‌సీ 2024-25 ఎగ్జామ్‌ క్యాలెండర్‌ ప్రకారం మే 7వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేస్తున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం జూన్‌ 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించి.. జులై- ఆగస్టు నెలలో రాత పరీక్షలు నిర్వహించనుంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్(గ్రూప్‌-సి నాన్‌ గెజిటెడ్‌, నాన్‌-మినిస్టీరియల్‌), హవల్దార్(గ్రూప్‌-సి నాన్‌-గెజిటెడ్‌, నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టులు భర్తీకానున్నాయి. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. గతేడాది 1,558 ఖాళీలు భర్తీ అయిన విషయం తెలిసిందే. ఎంటీఎస్‌ ఖాళీలను సెషన్-1, 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా; హవల్దార్ ఖాళీలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 
 

వెబ్‌సైట్ 
 

Updated Date : 07-05-2024 20:12:02

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం