• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 07-05-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)  

1.  మూడో దశలో 64.58% పోలింగ్‌

దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న సార్వత్రిక ఎన్నికల తృతీయ విడత పోలింగ్‌ ముగిసింది. పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న చెదురుమదురు ఘటనలను మినహాయిస్తే.. అంతటా ఈ ప్రక్రియ ప్రశాంతంగానే జరిగింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...




2.  రష్యా అధ్యక్షుడిగా ఐదోసారి పుతిన్‌!

ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ విజయం సాధించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. ఐదోసారి దేశ పాలనా పగ్గాలు చేపట్టారు. క్రెమ్లిన్‌లో ఘనంగా నిర్వహించిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...




3.  శుక్రగ్రహం ఎందుకు పొడిగా ఉందంటే!

భూమికి పొరుగునున్న శుక్రగ్రహం చాలా పొడిగా ఉంటుంది. దీనికి కారణాలను అమెరికా శాస్త్రవేత్తలు గుర్తించారు. అక్కడి వాతావరణంలోని హైడ్రోజన్‌.. అంతరిక్షంలోకి వెళ్లిపోతోందని వారు పేర్కొన్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...





4.  తెలంగాణలో భూగర్భ జలాలు వేగంగా ఖాళీ!

తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాలు చాలా వేగంగా ఖాళీ అయిపోతున్నాయి. ప్రాజెక్టులు, ఇతర నీటి వనరులకు ఈ ఏడాది ఆశించిన మేర ప్రవాహాలు రాలేదు. చెరువులు, నీటి కుంటలు ఎండిపోయాయి. దీంతో భూగర్భ జలాలను ఎడాపెడా తోడేస్తున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


 


5.  భారత్‌కు ఏడు స్వర్ణాలు 

ఆసియా అండర్‌-22, యూత్‌ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి   (54 కేజీలు), నిఖిల్‌ (57 కేజీలు), ఆకాశ్‌ గోర్కా (60 కేజీలు), పూనమ్‌ (57 కేజీలు), ప్రాచి  (63 కేజీలు), ముస్కాన్‌ (75

కేజీలు), విశ్వనాథ్‌ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...


 

Published Date : 08-05-2024 17:55:33

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం