• facebook
  • whatsapp
  • telegram

TSECET Preliminary Key: తెలంగాణ ఈసెట్‌ 2024 ప్రాథమిక కీ విడుదల 

* అభ్యంతరాలకు గడువు మే 12


ఈనాడు ప్రతిభ డెస్క్‌: తెలంగాణ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఈసెట్‌)-2024 ప్రాథమిక కీ విడుదలైంది. పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్‌ షీట్‌, మాస్టర్‌ ప్రశ్నపత్రాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కీపై అభ్యంతరాలకు గడువు మే 12లోగా ఆన్‌లైన్‌లో తెలియజేయాలి. ఈసెట్‌ ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్‌) అభ్యర్థులకు 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్‌ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్షను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మే 6న పరీక్ష జరుగిన విషయం తెలిసిందే.
 


  తెలంగాణ ఈసెట్‌ 2024 ప్రిలిమినరీ కీ కోసం క్లిక్‌ చేయండి  

Published Date : 09-05-2024 16:55:15

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం