• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 08-05-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)    

1.  దలైలామాకు పీవీ స్మారక పురస్కారం

ప్రపంచ శాంతి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు పీవీ నరసింహారావు మెమోరియల్‌ ఫౌండేషన్‌ ‘భారతరత్న పీవీ నరసింహారావు స్మారక పురస్కారా’న్ని అందించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


2.  2023- సౌర విద్యుత్తులో ప్రపంచంలో మూడోస్థానంలో భారత్‌ 

2023లో సౌర విద్యుదుత్పత్తిలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా భారత్‌ అవతరించింది. ఇంతవరకు జపాన్‌ ఈ స్థానంలో ఉండేది. గత ఏడాది ప్రపంచంలో మొత్తం విద్యుత్తులో 5.5 శాతాన్ని సూర్యుడి వెలుగుతోనే సాధించినట్లు ‘ఎంబెర్‌’ మేధోమథన సంస్థ నివేదిక తెలిపింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 



3.  రికార్డు సృష్టించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరోసారి సత్తా చాటింది. ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 10 వికెట్ల తేడాతో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ను చిత్తుచేసింది. మొదట లఖ్‌నవూ 4 వికెట్లకు 165 పరుగులే చేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


 


4.  ఏప్రిల్‌లోనూ రికార్డు ఉష్ణోగ్రతలే! 

గత నెలలో పుడమిపై ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరాయని ఐరోపా వాతావరణ సంస్థ పేర్కొంది. వరుసగా 11వ నెలలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం గమనార్హం. గడిచిన నెల.. అత్యంత ఉష్ణమయ ఏప్రిల్‌గా నిలిచిపోయింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



5.  ఆస్ట్రేలియాలో చదువుకు బ్యాంకులో రూ.16 లక్షలు ఉండాల్సిందే

వలసలను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోన్న ఆస్ట్రేలియా.. ఉన్నత చదువుల కోసం వచ్చే విదేశీ విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...


 

Published Date : 09-05-2024 17:54:05

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం