• facebook
  • whatsapp
  • telegram

UPSC NDA CDS Exam Result: యూపీఎస్సీ ఎన్‌డీఏ, సీడీఎస్‌ రాత పరీక్ష ఫలితాలు

* మొత్తం 857 ఖాళీల భర్తీ

ఈనాడు ప్రతిభ డెస్క్‌: రక్షణ రంగంలో ఖాళీల భర్తీకి యూపీఎస్సీ నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్‌ (NDA-1) 2024, కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ ఎగ్జామినేషన్‌ (CDS-1) 2024 రాత పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు తదుపరి పరీక్షలకు సన్నద్ధమవ్వాల్సి ఉంటుంది. ఈ పరీక్షలు ఏప్రిల్‌ 21వ తేదీన దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జరిగిన విషయం తెలిసిందే. ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ ఎగ్జామ్‌ ద్వారా 400 ఖాళీలు; సీడీఎస్‌ఈ ద్వారా 457 ఖాళీలు భర్తీ కానున్నాయి. రాత పరీక్ష(Written Test), ఇంటెలిజెన్స్- పర్సనాలిటీ టెస్ట్, ఎస్‌ఎస్‌బీ టెస్ట్‌/ ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్టు తదితరాల ఆధారంగా ఎంపిక (Selection) ప్రక్రియ నిర్వహిస్తారు.



  యూపీఎస్సీ ఎన్‌డీఏ రాత పరీక్ష ఫలితాల కోసం క్లిక్‌ చేయండి  


  యూపీఎస్సీ సీడీఎస్‌ రాత పరీక్ష ఫలితాల కోసం క్లిక్‌ చేయండి  


 

Updated Date : 09-05-2024 20:02:35

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం