• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 09-05-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)     

1.  పద్మవిభూషణ్‌ అందుకున్న చిరంజీవి, వైజయంతిమాల

ప్రముఖ సినీనటుడు కొణిదెల చిరంజీవి, సీనియర్‌ నటి, ప్రఖ్యాత భరతనాట్య కళాకారిణి వైజయంతిమాల బాలిలకు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము పద్మవిభూషణ్‌ అవార్డులు ప్రదానం చేశారు. మరో 9 మందికి పద్మభూషణ్, 55 మందికి పద్మశ్రీ పురస్కారాలను అందజేశారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...




2.  మహిళల టీ20.. భారత్‌ క్లీన్‌స్వీప్‌ 

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. చివరి మ్యాచ్‌లో భారత్‌ 21 పరుగుల తేడాతో నెగ్గింది. మొదట భారత్‌ 5 వికెట్లకు 156 పరుగులు సాధించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



3.  నియోమ్‌ మహానగర నిర్మాణం కోసం సౌదీ ఆదేశాలు

తమ కలల ప్రాజెక్టు ‘నియోమ్‌’కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...




4.  జనాభాలో హిందువుల వాటా తగ్గుదల 

భారత జనాభాలో హిందువుల శాతం క్రమంగా తగ్గుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) తెలిపింది. 1950లో మన దేశంలో 84.68%గా ఉన్న ఈ మెజార్టీ వర్గం వాటా.. 2015 నాటికి 78.06%కు క్షీణించిందని వెల్లడించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


 

5.  మాల్దీవుల మంత్రితో జైశంకర్‌ భేటీ

భారత్‌-మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం ఇరుదేశాల పరస్పర ప్రయోజనాలు, సున్నితాంశాలపై ఒకరినొకరు అర్థం చేసుకోవడంపై ఆధారపడి ఉంటాయని విదేశీ వ్యవహారాల మంత్రి జై శంకర్‌ స్పష్టం చేశారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...

Published Date : 10-05-2024 17:52:54

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం