* అభ్యంతరాలకు గడువు మే 12
![]() |
ఈనాడు ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ECET)-2024 ప్రాథమిక కీ (KEY) విడుదలైంది. పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రిలిమినరీ కీతో పాటు రెస్పాన్స్ షీట్, మాస్టర్ ప్రశ్నపత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కీపై అభ్యంతరాలకు గడువు మే 12లోగా ఆన్లైన్లో తెలియజేయాలి. ఈసెట్ ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ(మ్యాథమేటిక్స్) అభ్యర్థులకు 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈ/ బీటెక్ (BTech)/ బీఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్షను జేఎన్టీయూ (JNTU) అనంతపురం నిర్వహిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మే 8న పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే.