• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 10-05-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1.  కేజ్రీవాల్‌కు బెయిలు

సార్వత్రిక ఎన్నికలు పతాక స్థాయికి చేరిన వేళ దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...




2.  రఫాలో భీకర పోరు

రఫా శివార్లలో హమాస్, ఇజ్రాయెల్‌ రక్షణ దళాల (ఐడీఎఫ్‌) మధ్య భీకరపోరు ప్రారంభమైంది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని టెల్‌ అవీవ్‌ చెబుతున్నా, భారీస్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఐడీఎఫ్‌ దళాలు విరుచుకుపడుతున్నాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...




3.  తూర్పు కనుమల్లో కనుమరుగవుతున్న క్యాట్‌ఫిష్‌!

తూర్పు కనుమల్లోని నీటి వనరుల్లో 60శాతం దాకా క్యాట్‌ఫిష్‌ ఉనికి కనిపించిందని సీసీఎంబీ పరిశోధకులు వెల్లడించారు. ఆయా నీటి వనరుల నుంచి నమూనాలు సేకరించి ఎన్విరాన్‌మెంటల్‌ డీఎన్‌ఏ (ఈ-డీఎన్‌ఏ) ద్వారా వీరు పరిశోధనలు చేశారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...




4.  డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం!

హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల్లో అసాధారణ పోకడల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ మహమ్మారి విజృంభణలను ముందే అంచనా వేయవచ్చని తాజా పరిశోధన పేర్కొంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...




5.  5.8 శాతానికి చేరిన ఐఐపీ

దేశీయ పరిశ్రమల వృద్ధిని ప్రతిఫలించే పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.8 శాతానికి చేరింది. 2022-23లోని 5.2 శాతంతో పోలిస్తే మెరుగైనట్లయింది. ఈ ఏడాది మార్చిలో 4.9% వృద్ధిని నమోదు చేసింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...

Published Date : 11-05-2024 18:43:42

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం