• facebook
  • whatsapp
  • telegram

CBSE Results 2024: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

* రిజల్ట్స్‌ వెబ్‌సైట్‌ లింక్‌ ఇదే..

దిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (CBSE) 10, 12వ తరగతి ఫలితాలు వచ్చేశాయి. ఈ ఉదయం పన్నెండో తరగతి ఫలితాలను ప్రకటించిన బోర్డు.. తాజాగా పదో తరగతి రిజల్ట్స్‌ను ప్రకటించింది. విద్యార్థులు తాము సాధించిన స్కోరును cbse.gov.in, https://cbseresults.nic.in/ వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. రోల్‌ నంబర్‌, పుట్టిన తేదీ, స్కూల్‌ నంబర్‌, అడ్మిట్‌ కార్డు నంబర్‌లను ఎంటర్‌ చేయడం ద్వారా ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. అలాగే, డిజీలాకర్‌, ఉమాంగ్‌ మొబైల్‌ యాప్‌ల ద్వారా కూడా రిజల్ట్స్‌ పొందొచ్చు. (CBSE class 10, 12 Results Announced)



  10వ తరగతి ఫలితాల కోసం క్లిక్‌ చేయండి  
 

పదో తరగతిలో మొత్తం 93.60శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 2.12లక్షల మందికి 90శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇందులో 47,983 మంది 95శాతానికి పైగా స్కోరు సాధించారు. అత్యధికంగా తిరువనంతపురంలో 99.75శాతం, విజయవాడలో 99.60 శాతం, చెన్నైలో 99.30శాతం, బెంగళూరులో 99.26శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.



  12వ తరగతి ఫలితాల కోసం క్లిక్‌ చేయండి  
 

ఇక, ఈ ఏడాది 12వ తరగతిలో మొత్తం 87.98శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. 91.52శాతం ఉత్తీర్ణతతో అమ్మాయిలు రాణించారు. 85.12శాతం మంది బాలురు ఉత్తీర్ణత సాధించారు. 1.16లక్షల మంది విద్యార్థులకు 90శాతం కంటే ఎక్కువ మార్కులు వచ్చాయి. ఇందులో 24,068 మంది విద్యార్థులు 95శాతానికి పైగా స్కోరు సాధించినట్లు బోర్డు వెల్లడించింది. అత్యధికంగా తిరువనంతపురంలో 99.91శాతం, విజయవాడలో 99.04శాతం, చెన్నైలో 98.47శాతం, బెంగళూరులో 96.95శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీ వరకు 12వ తరగతి పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. విద్యార్థుల్లో అనారోగ్యకరమైన పోటీని నివారించేందుకు సీబీఎస్‌ఈ బోర్డు గత కొన్నేళ్లుగా మెరిట్‌ జాబితాలను వెల్లడించకూడదని నిర్ణయించిన విషయం తెలిసిందే.


  * రిజల్ట్స్‌ వెబ్‌సైట్‌ లింక్‌ ఇదే..  
 

Updated Date : 13-05-2024 15:12:27

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం