• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 14-05-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1.  వారణాసిలో ప్రధాని నామినేషన్‌

సార్వత్రిక ఎన్నికల సమరంలో వారణాసి నుంచి వరుసగా మూడోసారి పోటీకి ప్రధాని మోదీ నామినేషను దాఖలు చేశారు. పలువురు ఎన్డీయే నేతలు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరై ప్రధానికి సంఘీభావం తెలిపారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



2.  మనిక @ 24

భారత టేబుల్‌టెన్నిస్‌ స్టార్‌ మనిక బత్రా కెరీర్‌లో ఉత్తమ ర్యాంకు సాధించింది. ఇటీవలే ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో ఆమె 24వ స్థానాన్ని కైవసం చేసుకుంది. టాప్‌-25లో చోటు దక్కించుకున్న తొలి భారత టీటీ క్రీడాకారిణిగా మనిక ఘనత సాధించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



3.  క్యాన్సర్‌ పునరావృతానికి అడ్డుకట్ట!

చికిత్స తర్వాత క్యాన్సర్‌ పునరావృతమవుతుంటుంది. దీన్ని అడ్డుకునే సామర్థ్యమున్న మూడు రకాల మందులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భారత్‌కు చెందిన నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోమెడికల్‌ జీనోమిక్స్‌ (ఎన్‌ఐబీఎంజీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యూనాలజీ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



4.  2023-24లో పీఎస్‌బీల లాభం రూ.1,41,203 కోట్లు

దేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ (పీఎస్‌బీ) కలిపి గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రూ.1,41,203 కోట్ల నికరలాభాన్ని ఆర్జించాయి. 2022-23 లాభం రూ.1,04,649 కోట్లతో పోలిస్తే ఈ మొత్తం 35% అధికం. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



5.  విట్‌ వ్యవస్థాపకుడు విశ్వనాథన్‌కు న్యూయార్క్‌ వర్సిటీ డాక్టరేట్‌

తమిళనాడులోని ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ‘వెల్లూర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ (విట్‌) వ్యవస్థాపకుడు, ఛాన్స్‌లర్‌ అయిన డాక్టర్‌ జి.విశ్వనాథన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ న్యూయార్క్‌ (ఎస్‌యూఎన్‌వై) నుంచి గౌరవ డాక్టరేటు అందుకున్నారు. అమెరికాలోని బింగమ్‌టన్‌లో జరిగిన స్నాతకోత్సవంలో ఈ పురస్కారం అందజేశారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...

Published Date : 15-05-2024 17:41:20

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం