• facebook
  • whatsapp
  • telegram

Narayana: సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల పరీక్షల్లో నారాయణ విద్యార్థుల అద్భుత ప్రతిభ (ADVT)

  పదో తరగతిలో 500 మార్కులకు గరిష్ఠంగా 498 మార్కులు, పన్నెండో తరగతిలో 500 మార్కులకు

 493 మార్కులు నారాయణ విద్యార్థులు పొందారు. 

పన్నెండో తరగతిలో 500 మార్కులకు 493 మార్కులు నారాయణ విద్యార్థులు పొందారు.

 పదో తరగతిలో 9 మంది నారాయణ విద్యార్థులు 495 కంటే ఎక్కువ మార్కులు సాధించారు.

పదో తరగతిలో 2012 మంది నారాయణ విద్యార్థులు 90% కంటే ఎక్కువ మార్కులు దక్కించుకున్నారు.

పన్నెండో తరగతిలో 667 మంది నారాయణ విద్యార్థులు 90% కంటే ఎక్కువ మార్కులు సాధించారు.
 

హైదరాబాద్, మే 16, 2024: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 2024లో 10, 12 తరగతుల విద్యార్థులకు నిర్వహించిన వార్షిక పరీక్షల్లో ‘నారాయణ స్కూల్స్‌’ విద్యార్థులు అద్భుతంగా తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ మేరకు ఫలితాల వివరాలను ‘నారాయణ స్కూల్స్‌’ ప్రతినిధులు సగర్వంగా ప్రకటించారు. 


అన్ని సబ్జెక్టుల్లోనూ రాణింపు

పదో తరగతిలో మహారాష్ట్రలోని ముంబయికి చెందిన నారాయణ విద్యార్థి అగస్త్య రేమాని (రోల్‌ నం.15136452) గరిష్ఠంగా 500 మార్కులకు 498 సాధించారు. అన్ని సబ్జెక్టుల్లోనూ అద్భుతంగా రాణించారు. పన్నెండో తరగతి పరీక్షల్లో కామర్స్‌ విభాగంలో నారాయణ స్కూల్స్‌ విద్యార్థిని ముంబయికి చెందిన ఖ్యాతి శర్మ (హాల్‌ టికెట్‌ నం.15609812) గరిష్ఠంగా 500 మార్కులకు 493 మార్కులు సాధించారు. వాణిజ్య విభాగంలోని విభిన్న విషయాలకు సంబంధించి చక్కటి నైపుణ్యాన్ని, పరిజ్ఞానాన్ని ఆమె ఈ పరీక్షల్లో ప్రదర్శించారు. 


సమగ్ర పాఠ్య ప్రణాళితో సమర్థంగా కృషి

సీబీఎస్‌ఈ పది, పన్నెండు తరగతుల పరీక్షల్లో తమ విద్యార్థులు చూపిన ప్రతిభకు తామెంతో గర్వపడుతున్నామని నారాయణ స్కూల్స్‌ ప్రతినిధి డాక్టర్‌ పి. సింధూర తెలిపారు. సమకాలీన ప్రపంచంలో ఎదురవుతున్న పోటీకి అనుగుణంగా సమగ్ర పాఠ్య ప్రణాళికను రూపొందించి, విద్యార్థులను పరీక్షలకు సమర్థంగా సిద్ధం చేయడానికి తామెంతో కృషి చేసినట్లు ఆమె చెప్పారు. ప్రధానంగా ఎన్‌స్పోర్ట్స్, దిశ వంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల సమగ్రాభివృద్ధిపై తమ సంస్థ దృష్టి పెట్టినట్లు వివరించారు. విద్యార్థులు అనవసరమైన ఒత్తిడికి గురికాకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. 

 

ప్రత్యేకంగా మైక్రో షెడ్యూల్‌ సిస్టమ్‌

నారాయణ స్కూల్స్‌ మరో ప్రతినిధి పి. శారాణి విద్యార్థులకు అభినందనలు, అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. పిల్లలు ఆసక్తిగా, ఆనందంగా, సమర్థంగా పాఠాలు నేర్చుకోడానికి నారాయణ స్కూల్స్‌ రూపొందించిన మైక్రో షెడ్యూల్‌ సిస్టమ్‌ బాగా ఉపయోగపడిందని ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు. విద్యార్థుల నైపుణ్యాలకు అనుగుణంగా డిజైన్‌ చేసిన అసైన్‌మెంట్‌లు, ప్రతి ఒక్కరి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, పరిజ్ఞాన పరంగా ఉన్న అంతరాలను తగ్గించడానికి, ఇబ్బందులను తొలగించడానికి విద్యా సంవత్సరం మొత్తం చేసిన కృషి వల్ల ఈ విధమైన అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని ఆమె స్పష్టం చేశారు. 


నాలుగు దశాబ్దాలకు పైగా ఖ్యాతి

నాలుగు దశాబ్దాలకు పైగా నారాయణ స్కూల్స్‌ దేశవ్యాప్తంగా విశిష్టతకు మారుపేరుగా నిలిచాయి. పాఠశాల విద్యలో ఏటా ఉన్నత ప్రమాణాలను నెలకొల్పుతూ, అత్యుత్తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాయి. విద్యార్థులు తమ పూర్తి శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకొని అనుకున్న లక్ష్యాలను చేరుకోడానికి, కలలను సాకారం చేసుకోడానికి నారాయణ స్కూల్స్‌ పూర్తి అంకిత భావంతో విలువైన మార్గదర్శనం చేస్తున్నాయి. ‘మీ కలలే నారాయణ కలలు’ అంటూ నినదిస్తూ సాగిపోతున్నాయి.



    Narayana Group of Schools Website    

 

Updated Date : 16-05-2024 16:48:51

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం