• facebook
  • whatsapp
  • telegram

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ ప్రొవిజనల్‌ కీ విడుదల

* అభ్యంతరాలకు గడువు జూన్‌ 3

ఈనాడు ప్రతిభ డెస్క్‌: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2024 ప్రొవిజనల్‌ కీ విడుదలైంది. పరీక్ష రాసిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి ప్రశ్నపత్రంతో పాటు ప్రొవిజనల్‌ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కీపై అభ్యంతరాలు జూన్‌ 3 సాయంత్రం 5 గంటల్లోగా ఆన్‌లైన్‌లో తెలియజేయవచ్చు. పరీక్ష మే 26న ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2  మొత్తం రెండు సెషన్లలో పరీక్ష జరిగింది. దేశవ్యాప్తంగా ఎంత మంది పరీక్ష రాశారన్నది ఐఐటీ మద్రాస్‌ వెల్లడించలేదు. తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మంది రాసి ఉంటారని అంచనా. ఈసారి రెండు పేపర్లకు కలిపి మొత్తం 360 మార్కులకు పరీక్ష నిర్వహించారు. దీన్ని ఐఐటీలు నిర్ణయించి ఉంటాయని భావిస్తున్నారు. జూన్‌ 9న ర్యాంకులు వెల్లడించనున్నారు. ఈ పరీక్షలో ర్యాంకులు పొందిన వారికి దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీలు, ఇతర ప్రఖ్యాత సంస్థల్లో నిర్వహించే కోర్సుల్లో అడ్మిషన్లు లభిస్తాయి.

 


జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 పేపర్‌-1 ప్రొవిజనల్‌ కీ కోసం క్లిక్‌ చేయండి 


జేఈఈ అడ్వాన్స్‌డ్ 2024 పేపర్‌-2 ప్రొవిజనల్‌ కీ కోసం క్లిక్‌ చేయండి 

 

Updated Date : 02-06-2024 13:01:27

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం