• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 05-06-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)  

1.  జూన్‌ 9న  మోదీ ప్రమాణ స్వీకారోత్సవం
భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టడం ఖాయమైంది. తమ కూటమికి నాయకుడిగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయి. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

2.  ఎట్టకేలకు నింగిలోకి బోయింగ్‌ వ్యోమనౌక 
ఏళ్ల తరబడి జాప్యం తర్వాత బోయింగ్‌కు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌక జూన్‌ 5న నింగిలోకి పయనమైంది. ఇందులో భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)కు బయల్దేరారు. 
  పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


3.  పాతాళగంగ భగభగ!
భూగర్భ జలాల ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ శతాబ్దం చివరినాటికి అవి 2-3.5 డిగ్రీల సెల్సియస్‌ మేర వేడెక్కుతాయని చెబుతున్నారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

4.  శేషుమాధవ్‌కు ‘నాస్‌’ అత్యుత్తమ పురస్కారం 
మూడు దశాబ్దాలుగా వరి, పొగాకు పంటలపై పరిశోధనలు చేస్తున్న కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ డైరెక్టర్, వ్యవసాయ శాస్త్రవేత్త మాగంటి శేషుమాధవ్‌ (52)కు జాతీయ వ్యవసాయ శాస్త్రాల అకాడమీ (నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ - నాస్‌) అత్యున్నత పురస్కారం లభించింది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

5.  ఫ్రెంచ్‌ ఓపెన్లో  17ఏళ్ల మిరా మాయ 
ఫ్రెంచ్‌ ఓపెన్లో మిరా ఆంద్రీవా సత్తాచాటింది. మహిళల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ఈ రష్యా టీనేజీ అమ్మాయి 6-7 (5-7), 6-4, 6-4 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్‌ సబలెంకా (బెలారస్‌)పై సంచలన విజయాన్ని అందుకుంది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...

 

Updated Date : 07-06-2024 14:44:42

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం