• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 09-06-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1.  నరేంద్రమోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం
దేశ ప్రధానిగా నరేంద్ర దామోదర్‌దాస్‌ మోదీ జూన్‌ 9న ప్రమాణం చేశారు. 2014, 2019 ఎన్నికల్లో విజయం తర్వాత రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఆయన తాజా ఎన్నికల్లో కూటమి గెలుపుతో వరసగా మూడోసారి పీఠమెక్కిన ఘనత సాధించారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


2.  తొలిసారిగా తెలంగాణకు రెండు కేంద్ర మంత్రి పదవులు
తొలిసారిగా తెలంగాణ... కేంద్రంలో రెండు మంత్రి పదవులను సొంతం చేసుకుంది. పదేళ్ల భాజపా పాలనలో ఇప్పటివరకు ఒకరికే మంత్రి పదవి దక్కింది. 
  పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

3.  ఫ్రెంచ్‌ ఓపెన్‌ అల్కరాస్‌ సొంతం
నాదల్‌ వారసుడిగా పేరు పొందిన కార్లోస్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచాడు. అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) పై విజయం సాధించి అల్కరాస్‌ రొలాండ్‌ గారోస్‌లో ఛాంపియన్‌గా నిలిచాడు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


4.  ఏపీ నుంచి రామ్మోహన్‌నాయుడికి క్యాబినెట్‌ బెర్త్‌
కేంద్ర క్యాబినెట్‌లో ఏపీకి మూడు మంత్రి పదవులు దక్కాయి. ఎన్డీయే భాగస్వామి అయిన తెదేపా నుంచి శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడికి క్యాబినెట్‌ మంత్రి పదవి ఇచ్చారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

 


మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...

 

Published Date : 10-06-2024 17:41:05

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం