• facebook
  • whatsapp
  • telegram

TG TET results: తెలంగాణ టెట్‌ ఫలితాలు రేపే విడుదల

* పేపర్‌-1కి 86.03, పేపర్‌-2కి 82.58 శాతం మంది పరీక్షకు హాజరు

ప్రతిభ డెస్క్: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) ఫలితాలు బుధవారం (జూన్‌ 12న) విడుదల కానున్నాయి. మే 20న ప్రారంభమైన పరీక్షలు జూన్‌ 2తో ముగియగా మరుసటి రోజే ప్రిలిమినరీ కీ, రెస్పాన్స్‌ షీట్స్‌ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. పేపర్ల వారీగా కీని అందుబాటులో ఉంచిన అధికారులు వీటిపై అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం కల్పించారు. టెట్‌ పేపర్‌-1కు  99,958 మంది, పేపర్‌-2కు 1,86,423 మంది దరఖాస్తులు చేసుకోగా పేపర్‌-1కి 86.03 శాతం మంది, పేపర్‌-2కి 82.58 శాతం మంది హాజరయ్యారు. 

  వెబ్‌సైట్‌  

Updated Date : 11-06-2024 12:55:08

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం