• facebook
  • whatsapp
  • telegram

Jobs: యువతకు సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఉద్యోగాల కల్పన బాధ్యత తీసుకోండి

ఎమ్మెల్యే రాముకు మంత్రి లోకేశ్‌ సూచన


ఈనాడు, అమరావతి: అమెరికా నుంచి సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్ని తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించే బాధ్యత తీసుకోవాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాముకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ సూచించారు. శాసనసభ లాబీల్లో గురువారం తనకు ఎదురైన రాముతో లోకేశ్‌ మాట్లాడారు. అమెరికాలో స్థిరపడిన ప్రవాసాంధ్రులు పలువురు అక్కడ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు స్థాపించారని, వారిలో కొందరి చేత రాష్ట్రంలో సంస్థల్ని ఏర్పాటు చేయించినా, యువతకు ఉపాధి లభిస్తుందని ఆయన అన్నారు.  ఇప్పటికే ఆ దిశగా కృషి ప్రారంభించానని రాము తెలిపారు. 
 

Published Date : 26-07-2024 12:52:52

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం