• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌ ప్రయోగ పరీక్షలకు ఏర్పాట్లు

విజయవాడ సబ్‌కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర సైన్సు విద్యార్థులకు మార్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్‌ 24 వరకు ప్రయోగ పరీక్షలు నిర్వహించనున్నట్టు కలెక్టరు ఇంతియాజ్‌ తెలిపారు. కొవిడ్‌-19 నిబంధనలకు అనుగుణంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. నగరంలోని విడిది కార్యాలయంలో పరీక్షల సమన్వయ కమిటీ సమావేశాన్ని మార్చి 24న‌ నిర్వహించారు. కలెక్టరు మాట్లాడుతూ.. ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ప్రయోగ పరీక్షలకు 47,315 మంది విద్యార్థులు హాజరుకానున్నట్టు వెల్లడించారు. పట్టణ ప్రాంతాల్లో 47, గ్రామీణ ప్రాంతాల్లో 45 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. జబ్లింగు విధానంలో పరీక్షలు ఉంటాయన్నారు. వృక్ష, జంతు, భౌతిక, రసాయన శాస్త్రాల ప్రయోగ పరీక్షలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. ఇంటర్‌ థియరీ మొదటి సంవత్సర పరీక్షలు మే 5 నుంచి, ద్వితీయ సంవత్సర పరీక్షలు మే 4 నుంచి నిర్వహించనున్నట్టు వివరించారు. ఇంటర్‌ బోర్డు ప్రాంతీయ తనిఖీ అధికారి రవికుమార్‌, ఇన్‌ఛార్జి డీఈవో చంద్రకళ, వీఎంసీ అదనపు కమిషనరు మోహనరావు పాల్గొన్నారు.

Published Date : 25-03-2021 10:59:57

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం