• facebook
  • whatsapp
  • telegram

AP Inter: ఇంటర్మీడియట్‌ సిలబస్‌ 30 శాతం తగ్గింపు

ఈనాడు, అమరావతి: ఇంటర్మీడియట్‌ప్రథమ, ద్వితీయ సంవత్సరం సిలబస్‌ను 30 శాతం తగ్గిస్తూ ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి శేషగిరిబాబు ఆదేశాలు జారీ చేశారు. కరోనా కారణంగా జూనియర్‌కళాశాలల పనిదినాలు తగ్గడంతో సిలబస్‌ను తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించే పరీక్షల్లో 70 శాతం సిలబస్‌నుంచే ప్రశ్నలు వస్తాయని, తొలగించిన 30 శాతాన్ని సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు, ఖాళీ పీరియడ్స్‌లో బోధించాలని సూచించారు. గతేడాది 2020 - 21లోనూ 30శాతం సిలబస్‌ను తగ్గించారు. సబ్జెక్టుల వారీగా తొలగించిన పాఠాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

పాఠశాల విద్యలోనూ తగ్గింపు..

పాఠశాల విద్యలో ఇప్పటికే సబ్జెక్టుల వారీగా రెండేసి అధ్యాయాలు (ఛాప్టర్స్‌) తగ్గించారు. ఈ మేరకు అకడమిక్‌కేలండర్‌ను విడుదల చేశారు. సబ్జెక్టుల వారీగా తగ్గించిన సిలబస్‌వివరాలను ఉపాధ్యాయులకు అందించారు.

మరింత సమాచారం... మీ కోసం!

* పాఠ్యపుస్తక పఠనమే కీలకం 

* ప్రమాణాలపై పట్టు సాధించాలి

నేర్చుకుందాం నిరంతరం!

పరీక్షా పత్రాలు... ప్రశ్నల రూపాలు 

అవుతారా... సిస్టర్‌? 

Updated Date : 10-11-2021 12:08:59

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం