• facebook
  • whatsapp
  • telegram

Inter Practicals: రేపటి నుంచి ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మార్చి 23వ తేదీ నుంచి ఇంటర్మీడియట్‌ ప్రయోగ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1,882 కళాశాలల్లో జరగనున్న ఈ పరీక్షలకు దాదాపు 3.52 లక్షల మంది హాజరుకానున్నారు. అందులో బైపీసీ గ్రూపు విద్యార్థులు 1.01 లక్షలు, ఎంపీసీ గ్రూపు విద్యార్థులు 1.56 లక్షల మంది ఉన్నారు. మిగిలిన వారు ఒకేషనల్‌, జాగ్రఫీ విద్యార్థులున్నారు.

డిపార్ట్‌మెంట్‌ అధికారులను కొనసాగించాలని ఆందోళన

ఈసారి ఇంటర్‌ ప్రయోగ పరీక్షలను డిపార్ట్‌మెంట్‌ అధికారులు లేకుండానే జరపాలని ఇంటర్‌బోర్డు నిర్ణయించింది. దీంతో వారిని కొనసాగించాలని ఇంటర్‌ విద్యా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మార్చి 21న‌ బోర్డు కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ప్రైవేట్‌, కార్పొరేట్‌ కళాశాలలకు అనుకూలంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని సమితి నేతలు జంగయ్య, రామకృష్ణగౌడ్‌, వెంకటేశ్వర్లు, డాక్టర్‌ కొప్పిశెట్టి సురేష్‌ తదితరులు ఆరోపించారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు.

మరింత సమాచారం ... మీ కోసం!

ఇంటర్‌ స్టడీమెటీరియల్

ఇంట‌ర్మీడియ‌ట్‌ మోడ‌ల్‌ పేప‌ర్లు

రైల్‌టెల్‌ కార్పొరేషన్‌లో 103 అప్రెంటిస్‌ ఖాళీలు

హాల్‌-కోరాపుట్‌లో మెడిక‌ల్ స్టాఫ్

ఇండియన్ నేవీలో 2500 సెయిలర్లు

చదువు, పరిశోధనల మణిహారం

అడోబ్‌ ఇంటర్న్‌షిప్‌ అలా సాధించారు!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chat and Google News

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-03-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.