• facebook
  • whatsapp
  • telegram

ఏపీ - టెన్త్ క్లాస్ కొత్త ప‌రీక్ష విధానం

ఏయే ప్ర‌శ్న‌లు ఎన్ని మార్కులకు?

​​​​​​​

ఈనాడు, అమరావతి: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను ఏడు పేపర్ల ద్వారా నిర్వహించనున్నారు. ఏటా 11 పేపర్లతో నిర్వహించే పరీక్షలను ఈ సారి కొవిడ్‌-19 నేపథ్యంలో ఏడింటికి పరిమితం చేశారు. ప్రతి పరీక్షకు రెండున్నర గంటల సమయం కేటాయిస్తూ పాఠశాల విద్యా శాఖ ఫిబ్ర‌వ‌రి 18న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది జరిగే పబ్లిక్‌, అడ్వాన్డు సప్లిమెంటరీ పరీక్షలకు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుంది. సామాన్య శాస్త్రం మినహా మిగిలిన పరీక్షల్లో ఆబ్జెక్టివ్‌, సంక్షిప్త, క్లుప్త, వ్యాస రూపంలో ఇచ్చే 33 సమాధానాలకు వంద మార్కులు కేటాయించారు. సామాన్య శాస్త్రంలో 2 పేపర్లతో 50 మార్కుల చొప్పున నిర్వహిస్తారు. జూన్‌ 7 నుంచి పరీక్షలు జరగనున్నాయి.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.